logo

ఏకోపాధ్యాయ పాఠశాలల్లో పరీక్షలు ఎలా?

జిల్లాలో శుక్రవారం నుంచి ఆరంభమయ్యే ఎఫ్‌ఏ-2 పరీక్షలు ఉపాధ్యాయులకు సవాలుగా మారాయి.

Published : 02 Dec 2022 03:00 IST

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: జిల్లాలో శుక్రవారం నుంచి ఆరంభమయ్యే ఎఫ్‌ఏ-2 పరీక్షలు ఉపాధ్యాయులకు సవాలుగా మారాయి. ఏకోపాధ్యాయ పాఠశాలల్లో వీటిని ఎలా నిర్వహించాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్నారు. మొత్తం 415 ఏకోపాధ్యాయ పాఠశాలలున్నాయి. పరీక్షలు ఈనెల 6వ తేదీ వరకు కొనసాగుతాయి. ప్రశ్నపత్రాన్ని ఆన్‌లైన్‌లో నిర్ణీత సమయానికి గంట ముందు పంపిస్తారు. దానిని ఉపాధ్యాయులు డౌన్‌లోడ్‌ చేసుకొని బోర్డుపై రాయాలి. ఆ ప్రశ్నలను విద్యార్థులు రాసుకొని సమాధానాలు పూరించాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం 20 మందికన్నా లోపు పిల్లలుంటే ఏకోపాధ్యాయ పాఠశాలలుగా కొనసాగిస్తారు. జిల్లాలో 70 మంది విద్యార్థులున్న చోట కూడా ఏకోపాధ్యాయులే కొనసాగుతున్నారు. 3,4,5 తరగతులను విలీనం చేశాక ఈ సమస్య ఉత్పన్నమైంది. ఒంగోలు ఏబీఎం ఉన్నతపాఠశాలలో 40 మందికి ఒక్కరే ఉపాధ్యాయుడు ఉన్నారు. అలాంటిచోట అన్ని తరగతుల ప్రశ్నపత్రాలు డౌన్‌లోడ్‌ చేసుకొని బోర్డుపై రాయడం సాధ్యమేనా అని ఉపాధ్యాయ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. బదిలీల ప్రక్రియ నిలిచిపోవడంతో పిల్లలు తగినంతమంది ఉన్నచోట కూడా బోధకులు లేరు. సమస్యను ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ గిల్డ్‌ ప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

Read latest Prakasam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని