logo

జగనన్నా.. నీటి కష్టాలు చూడన్నా..

ఈ చిత్రంలో కనిపిస్తున్నది యర్రగొండ పాలెంలోని జగనన్న కాలనీ. కాలనీలో ఇంటి నిర్మాణానికి అవసరమైన నీటిని ట్యాంకర్‌తో తెప్పించుకొని నీటి కుండీలో నింపుతున్న లబ్ధిదారుడిని చూడొచ్చు.

Published : 02 Dec 2022 03:00 IST

ఈ చిత్రంలో కనిపిస్తున్నది యర్రగొండ పాలెంలోని జగనన్న కాలనీ. కాలనీలో ఇంటి నిర్మాణానికి అవసరమైన నీటిని ట్యాంకర్‌తో తెప్పించుకొని నీటి కుండీలో నింపుతున్న లబ్ధిదారుడిని చూడొచ్చు. యర్రగొండ పాలెం నుంచి మాచర్ల వెళ్లే దారిలో మిల్లంపల్లి టోల్‌ గేట్‌ వద్ద చిన్న గుట్టపై జగనన్న కాలనీ కోసం స్థలాలు ఇచ్చారు. ఇక్కడ  బోర్‌ పడక పోవడంతో ట్యాంకర్‌ తో నీళ్లు తెప్పించుకోవాల్సిందే. ప్రతి రోజూ ఐదు ట్యాంకర్ల నీటిని తెప్పించుకుంటున్నామని, ఒక్కొక్క ట్యాంకర్‌కు రూ.500 చొప్పున ఇవ్వాల్సి వస్తోందని లబ్ధిదారులు వాపోతున్నారు. మూడు నెలలుగా ఇలా తెప్పించడంతో డబ్బులు చెల్లించలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదీ మంత్రి ఆదిమూలపు సురేష్‌ నియోజకవర్గ కేంద్రంలోని పరిస్థితి.  

ఈనాడు, ఒంగోలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని