logo

బాల్య వివాహాల నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ

బాల్య వివాహాలు నివారించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ సూచించారు. సచివాలయం స్థాయిలో ప్రత్యేక పర్యవేక్షణ ఉండేలా మహిళా పోలీసులకు విధులు కేటాయించామన్నారు.

Published : 03 Dec 2022 05:04 IST

ర్యాలీని ప్రారంభిస్తున్న కలెక్టర్‌ దినేష్‌కుమార్‌.. చిత్రంలో డీఆర్డీఏ

పీడీ బాబూరావు, మెప్మా పీడీ రవికుమార్‌ తదితరులు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: బాల్య వివాహాలు నివారించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ సూచించారు. సచివాలయం స్థాయిలో ప్రత్యేక పర్యవేక్షణ ఉండేలా మహిళా పోలీసులకు విధులు కేటాయించామన్నారు. ఐసీడీఎస్‌, డీఆర్డీఏ, మెప్మా ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ వద్ద శుక్రవారం నిర్వహించిన ర్యాలీని జెండా ఊపి ఆయన ప్రారంభించారు. ప్రతి బాలిక కనీసం 12వ తరగతి పూర్తి చేసేలా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. బాల్య వివాహాల్లో ప్రకాశం జిల్లా రాష్ట్రంలో రెండో స్థానంలో ఉందని.. ఈ పరిస్థితిని మార్చేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. మహిళా సాధికారత జిల్లాగా మార్చడంలో అంతా భాగస్వాములు కావాలని కోరారు. చర్చి సెంటర్‌లో మానవహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ చేశారు. డీఆర్డీఏ పీడీ బాబూరావు, మెప్మా పీడీ రవికుమార్‌, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ సభ్యురాలు పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని