logo

పట్నాకు సెపక్‌తక్రా రాష్ట్ర జట్లు

బిహార్‌ రాజధాని పట్నాలో ఈ నెల అయిదో తేదీ నుంచి తొమ్మిది వరకు నిర్వహించనున్న జాతీయ స్థాయి సెపక్‌తక్రా పోటీల్లో పాల్గొనే బాలబాలికల రాష్ట్ర జట్లు శుక్రవారం ఒంగోలు నుంచి బయలుదేరి వెళ్లాయి.

Published : 03 Dec 2022 05:04 IST

బాలబాలికల జట్ల క్రీడాకారులతో ఒలింపిక్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు

ఒంగోలు క్రీడావిభాగం, న్యూస్‌టుడే: బిహార్‌ రాజధాని పట్నాలో ఈ నెల అయిదో తేదీ నుంచి తొమ్మిది వరకు నిర్వహించనున్న జాతీయ స్థాయి సెపక్‌తక్రా పోటీల్లో పాల్గొనే బాలబాలికల రాష్ట్ర జట్లు శుక్రవారం ఒంగోలు నుంచి బయలుదేరి వెళ్లాయి. జాతీయ స్థాయి పోటీలకు వెళ్తున్న రాష్ట్ర జట్లకు ఒంగోలులో వారంరోజుల పాటు శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు నంద్యాల జిల్లా అహోబిలానికి చెందిన సీసీఎన్‌ఎస్‌ ట్రస్ట్‌ ఆధ్వరంలో క్రీడాదుస్తులు బహూకరించారు. అనంతరం జిల్లా ఒలింపిక్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కుర్రా భాస్కరరావు మాట్లాడుతూ.. జాతీయ స్థాయి సెపక్‌తక్రా పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌ బాలబాలికల జట్లు విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సెపక్‌తక్రా సంఘం రాష్ట్ర కార్యదర్శి జి.శ్రీనివాసులు, జిల్లా కార్యదర్శి డి.రవిప్రసాద్‌, నంద్యాల జిల్లా సంఘం ప్రతినిథులు నాగేంద్ర, దేవేంద్ర, ఒంగోలు మున్సిపల్‌ కార్పొరేటర్లు సురేష్‌బాబు, నాగరాజు, అంతర్జాతీయ క్రీడాకారులు మధు, అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని