logo

విద్యార్థులను ఓటర్లుగా చేర్చడంపై ప్రత్యేక దృష్టి

కళాశాలలకు వెళ్లి అర్హులైన విద్యార్థులను ఓటర్లుగా చేర్పించాలని ఒంగోలు ఆర్డీవో విశ్వేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియపై ఒంగోలు రెవెన్యూ డివిజనల్‌ కార్యాలయంలో బీఎల్వోలతో ఆయన శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.

Published : 03 Dec 2022 05:04 IST

అధికారులతో సమీక్షిస్తున్న ఒంగోలు ఆర్డీవో విశ్వేశ్వరరావు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: కళాశాలలకు వెళ్లి అర్హులైన విద్యార్థులను ఓటర్లుగా చేర్పించాలని ఒంగోలు ఆర్డీవో విశ్వేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియపై ఒంగోలు రెవెన్యూ డివిజనల్‌ కార్యాలయంలో బీఎల్వోలతో ఆయన శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 18, 19 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారిని ఓటర్లుగా చేర్పించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఓటర్ల జాబితా నుంచి మృతుల వివరాలను తొలగించాలని ఆదేశించారు. ఆధార్‌ అనుసంధానం ప్రక్రియలో భాగంగా వివరాలు సేకరించాలన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే బీఎల్వోలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో తహసీల్దార్‌ మురళి, నగరపాలక సంస్థ సహాయ కమిషనర్‌ వీరాంజనేయులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని