logo

దీపం ఒత్తులు, బొట్టు బిళ్లల కేసు నిందితుడి అరెస్టు

దీపం ఒత్తులు, బొట్టుబిళ్లల తయారీ యంత్రాలు అమ్మి బోర్డు తిప్పేసిన ఘరానా మోసగాడిని మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కుషాయిగూడ పోలీసులు అరెస్టు చేశారు.

Published : 03 Dec 2022 05:04 IST

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: దీపం ఒత్తులు, బొట్టుబిళ్లల తయారీ యంత్రాలు అమ్మి బోర్డు తిప్పేసిన ఘరానా మోసగాడిని మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కుషాయిగూడ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద 14 ఒత్తులు, బొట్టుబిళ్లల తయారీ యంత్రాలు, ముడి సరకు, కార్యాలయంలోని రికార్డులు, డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకొని న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఇన్‌స్పెక్టర్‌ పి.వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. రాచర్ల మండలం గంగంపల్లికి చెందిన రావులకొల్లు రమేష్‌(40) ఏడేళ్ల క్రితం నగరానికొచ్చారు. ఏఎస్‌రావునగర్‌ డివిజన్‌ పరిధిలోని జమ్మిగడ్డలో నివాసం ఉంటున్నాడు. ఏడాది క్రితం ఏఎస్‌రావునగర్‌లో ఆర్‌ఆర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ఏర్పాటు చేసి వత్తులు, బొట్టుబిళ్లల తయారీ యంత్రాల వ్యాపారం ప్రారంభించాడు. యంత్రాలు కొన్న వారికి ముడి సరకు ఇచ్చి తానే ఉత్పత్తులు కొనుగోలు చేస్తానని నమ్మించాడు. ఏడాదిలో వందలాది మందికి వాటిని విక్రయించాడు. కొన్ని నెలలుగా ఉత్పత్తులు కొనుగోలు చేయకుండా ముఖం చాటేశాడు. మోసపోయామని గుర్తించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిఘా పెట్టిన పోలీసులు శుక్రవారం ఉదయం ఆటోలో రమేష్‌ వస్తుండగా జమ్మిగడ్డలో ఎస్సై వేణుమాధవ్‌, కానిస్టేబుళ్లు అశోక్‌, మహేష్‌ అరెస్టు చేసి మల్కాజిగిరి కోర్టులో హాజరు పరిచారు. నిందితుడిపై ఇప్పటికే వనస్థలిపురం ఠాణాలో ఒకటి, కుషాయిగూడ ఠాణాలో రెండు కేసులున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని