‘ఉన్నత లక్ష్యాలకు వైకల్యం అడ్డుకాదు’
జీవితంలో ఉన్నత లక్ష్యాలను చేరుకోవడానికి అంగ వైకల్యాన్ని అడ్డుగా భావించరాదని కలెక్టర్ దినేష్‌కుమార్ సూచించారు. ప్రకాశం భవన్‌లోని స్పందన సమావేశ మందిరంలో శనివారం ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం నిర్వహించారు.
విభిన్న ప్రతిభావంతులకు ల్యాప్‌టాప్‌లు అందజేస్తున్న కలెక్టర్ దినేష్‌కుమార్, మేయర్ సుజాత
ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: జీవితంలో ఉన్నత లక్ష్యాలను చేరుకోవడానికి అంగ వైకల్యాన్ని అడ్డుగా భావించరాదని కలెక్టర్ దినేష్‌కుమార్ సూచించారు. ప్రకాశం భవన్‌లోని స్పందన సమావేశ మందిరంలో శనివారం ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం నిర్వహించారు. గ్రామాల్లో ఎంత మంది విభిన్న ప్రతిభావంతులు ఉన్నారు? వారి విద్యార్హతలు, ఉద్యోగం చేస్తున్నారా లేదా? అనే అంశాలపై సర్వే చేయిస్తున్నట్లు తెలిపారు. తద్వారా వారికి ఉద్యోగం, ఉపాధి కల్పిస్తామన్నారు. పింఛను, ప్రభుత్వ పథకాలు పొందడానికి అర్హత ఉండి కూడా దక్కనివారిని గుర్తించి లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. భవిత కేంద్రాలకు వెళ్లలేని స్థితిలో ఉన్న పిల్లలకు ఇళ్ల వద్దనే శిక్షణ ఇప్పిస్తామన్నారు. ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వడంతోపాటు, బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేస్తామన్నారు. అర్హులకు జగనన్న కాలనీల్లో ముందు వరుసలో స్థలాలు కేటాయిస్తామన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి శ్యాంబాబు మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులకు అన్ని విధాలా అండగా ఉంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఒంగోలు మేయర్ గంగాడ సుజాత, జిల్లా సాంఘిక సంక్షేమశాఖ, గిరిజన సంక్షేమశాఖ, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమశాఖ అధికారులు లక్ష్మానాయక్, జగన్నాథరావు, అర్చనతో పాటు డీఆర్డీఏ పీడీ బాబూరావు, మెప్మా పీడీ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. క్రీడా పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. 15 మంది విభిన్న ప్రతిభావంతులకు ల్యాప్‌టాప్‌లు, ముగ్గురికి బ్యాక్లాగ్ కోటాలో ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
PM-KUSUM: ‘పీఎం కుసుమ్’ పథకం 2026 వరకు పొడిగింపు
-
Politics News
Arvind Kejriwal: రాజకీయాల్లో ‘ఆమ్ఆద్మీ’ సక్సెస్.. ఎందుకంటే..!
-
Sports News
IPL 2023: అప్పటికల్లా.. ఫుట్‌బాల్ లీగ్ కంటే అతిపెద్ద ఈవెంట్ ఐపీఎల్ అవుతుంది: స్ట్రాస్
-
World News
Hong Kong: 5 లక్షల విమాన టికెట్లు ఫ్రీ.. పర్యాటకులకు హాంకాంగ్ ఆఫర్!
-
Movies News
Pawan Kalyan: సినిమాల నుంచి అప్పుడే రిటైర్డ్ అవ్వాలనుకున్నా.. నా పెళ్లిళ్లు అనుకోకుండానే..!: పవన్ కల్యాణ్
-
Politics News
Nitin Gadkari: నితిన్ గడ్కరీ ఇలాకాలో భాజపాకి ఎదురుదెబ్బ