logo

ఒప్పంద ఉద్యోగులను క్రమబద్దీకరించాంటూ వినతి

రాష్ట్ర వ్యాప్తంగా వైద్య విధాన పరిషత్తు, వైద్యశాఖలో పని చేస్తున్న ఒప్పంద స్టాఫ్‌ నర్సులను వెంటనే క్రమబద్దీకరించడానికి చర్యలు తీసుకోవాలని సంఘ నాయకులు కోరారు.

Published : 04 Dec 2022 05:23 IST

మంత్రి ఆదిమూలపు సురేష్‌కు వినతిపత్రం అందజేస్తున్న

స్టాఫ్‌ నర్సస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ నాయకులు

మార్కాపురం, న్యూస్‌టుడే: రాష్ట్ర వ్యాప్తంగా వైద్య విధాన పరిషత్తు, వైద్యశాఖలో పని చేస్తున్న ఒప్పంద స్టాఫ్‌ నర్సులను వెంటనే క్రమబద్దీకరించడానికి చర్యలు తీసుకోవాలని సంఘ నాయకులు కోరారు. శనివారం మార్కాపురంలో పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ను కలిసి తమ సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. స్థానిక లక్ష్మీచెన్నకేశవనగర్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏపీ కాంట్రాక్ట్‌ స్టాఫ్‌ నర్సుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వారంతా ఆయనను కలిసి తమ సమస్యలను విన్నవించారు.

Read latest Prakasam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు