logo

అగ్రిటెక్‌ ప్రదర్శనకు జిల్లా రైతులు

వ్యవసాయంలో మెలకువలు, నూతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై రైతులు అవగాహన పెంచుకోవాలని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ పేర్కొన్నారు.

Published : 04 Dec 2022 05:23 IST

జెండా ఊపి రైతుల బస్సును ప్రారంభిస్తున్న కలెక్టర్‌ దినేష్‌కుమార్‌

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: వ్యవసాయంలో మెలకువలు, నూతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై రైతులు అవగాహన పెంచుకోవాలని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ పేర్కొన్నారు. ఆ మేరకు గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న అగ్రిటెక్‌ ప్రదర్శనకు... జిల్లా నుంచి రైతులతో వెళ్తున్న బస్సును జెండా ఊపి శనివారం ప్రారంభించారు. వ్యవసాయ రంగంలో వస్తున్న నూతన ఆవిష్కరణలు, ఉత్తమ విధానాలపై వ్యవసాయ శాస్త్రవేత్తల పర్యవేక్షణలో మూడు రోజుల అవగాహన కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. జిల్లా నుంచి ఈ మూడు రోజుల్లో 600 మంది రైతులను సదస్సుకు పంపేలా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాసరావు, ఏడీఏ రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని