బటన్ నొక్కడం మినహా అభివృద్ధి లేదు
బటన్ నొక్కడం, భజన చేయడం మినహా రాష్ట్రంలో అభివృద్ధి లేదని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. వైకాపా, తెదేపాలు రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు.
ఎంపీ జీవీఎల్ నరసింహారావు విమర్శ
సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ జీవీఎల్ నరసింహారావు, చిత్రంలో
భాజపా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, నాయకులు
ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: బటన్ నొక్కడం, భజన చేయడం మినహా రాష్ట్రంలో అభివృద్ధి లేదని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. వైకాపా, తెదేపాలు రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు. ఒంగోలు మౌర్య హోటల్‌లో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేవలం ప్రకాశం జిల్లా మాత్రమే కాదని.. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు సైతం వీరు చేసిందేమీ లేదని అన్నారు. ప్రకాశం, చిత్తూరు జిల్లాలకు కేంద్రం పదేళ్ల క్రితమే నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్(నిమ్జ్) ప్రకటిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం దానిని పక్కనపెట్టేసిందని విమర్శించారు. జిల్లాలో నిమ్జ్ ఏర్పాటైతే మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు వాటంతటవే వస్తాయని.. తద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగయ్యేవని పేర్కొన్నారు. తాగు, సాగునీటి సమస్యలు ఇప్పటికీ అలాగే ఉన్నాయని చెప్పారు. వెలిగొండ ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో అర్థంకాని పరిస్థితులు ఉన్నాయన్నారు. ఆ ప్రాజెక్టు పూర్తి కావాలంటే రూ.1,500 కోట్లు కావాలని.. గుత్తేదారులకు డబ్బులు ఇవ్వని ప్రభుత్వం కోట్లు ఖర్చుపెట్టి ప్రకటనలు ఇచ్చి సొంత డబ్బా కొట్టుకుంటోందని వ్యాఖ్యానించారు. నడికుడి - శ్రీకాళహస్తి రైల్వే ప్రాజెక్టును సైతం రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. భాజపా అధికారంలోకి వస్తేనే రాష్ట్ర సమగ్రాభివృద్ది సాధ్యమవుతుందని పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు శిరసనగండ్ల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
‘మద్యం కుంభకోణంలో ఆరోపణలు రుజువైతే శిక్ష తప్పదు’
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్లీ మద్యం కుంభకోణంలో దోషులు ఎంతటివారైనా శిక్ష తప్పదని... దక్షిణాది వారిపై ఉత్తరాది వ్యాపారులు కుట్ర చేస్తున్నారంటూ కొందరు చేస్తున్న వ్యాఖ్యలు విషయాన్ని పక్కదారి పట్టించడానికేనని ఎంపీ జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం... అవినీతిపై యుద్ధం ప్రకటించిందన్నారు. దిల్లీ మద్యం కుంభకోణంలో విచారణ జరుగుతున్న కొద్దీ కఠోర వాస్తవాలు బయటపడుతున్నాయని పేర్కొన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన కొందరి పాత్ర ఇందులో వెలుగు చూస్తోందన్నారు. ఈడీ, సీబీఐ కేవలం కేసు దర్యాప్తు మాత్రమే చేస్తాయని... దోషులను శిక్షించేది న్యాయస్థానమన్న విషయాన్ని తెలుసుకోవాలన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
KS Bharat: రాకెట్ స్పీడ్‌తో ఇక్కడికి చేరుకోలేదు.. ద్రవిడ్ ప్రభావం చాలా ఉంది: కేఎస్ భరత్
-
Movies News
Sridevi: ‘ది లైఫ్ ఆఫ్ ఎ లెజెండ్’ పేరుతో శ్రీదేవి జీవిత చరిత్ర
-
Crime News
Crime News: విషాదం.. మంటల్లో నలుగురు చిన్నారుల సజీవ దహనం
-
Sports News
IND vs AUS: లంచ్ బ్రేక్.. అర్ధశతకం దిశగా లబుషేన్.. ఆసీస్ స్కోరు 76/2 (32)
-
World News
Biden: జిన్‌పింగ్‌కు పరిమితులు తెలుసు..: బైడెన్
-
World News
Earthquake: చేజారిన ఆ 72 గంటలు.. తుర్కియే, సిరియాల్లో భారీగా పెరగనున్న మృతులు..!