‘ప్రసాద్ హత్య కేసు నిందితులను కఠినంగా శిక్షించాలి’
కేఎన్పీఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు మన్నం ప్రసాద్ హత్య కేసు నిందితులను కఠినంగా శిక్షించాలని విప్లవ రచయితల సంఘం రాష్ట్ర నాయకుడు జి.కల్యాణరావు, కేఎన్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుడ్డు ప్రభాకర్ డిమాండ్ చేశారు.
సమావేశంలో మాట్లాడుతున్న విరసం నాయకుడు కల్యాణరావు,
చిత్రంలో కేఎన్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ తదితరులు
ఒంగోలు నేర విభాగం, న్యూస్‌టుడే: కేఎన్పీఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు మన్నం ప్రసాద్ హత్య కేసు నిందితులను కఠినంగా శిక్షించాలని విప్లవ రచయితల సంఘం రాష్ట్ర నాయకుడు జి.కల్యాణరావు, కేఎన్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుడ్డు ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఒంగోలు ప్రెస్‌క్లబ్‌లో శనివారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. నక్సలైట్లకు సహకరిస్తున్నాడన్న పేరుతో ప్రసాద్‌ను అత్యంత కిరాతకంగా పొట్టనబెట్టుకున్నది నయీం ముఠాయేనని అప్పట్లో తాము ఎంతగా చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. ప్రభుత్వ ప్రోత్సాహంతోనే ఈ హత్య జరిగిందని ఆరోపించారు. దోపిడీకి గురవుతున్న ప్రజలకు అండగా ఉంటున్న ప్రజా, హక్కుల సంఘాల నాయకులను హత్య చేయించేందుకు పాలకవర్గాలు ఇటువంటి హంతక ముఠాలను సృష్టించాయని ధ్వజమెత్తారు. చంద్రబాబు పెంచి పోషించిన నయీమ్ ముఠాను రాజశేఖర్‌రెడ్డి ప్రోత్సహించారని ఆరోపించారు. 2004లో రాజశేఖర్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత చర్చల పేరిట నక్సలైట్లను బయటకు పిలిచి నెత్తురు పారించారన్నారు. అనంతరం నయీమ్ ఆధ్వర్యంలో ఒక ముఠాను ఏర్పాటుచేసి నల్లమల నల్లత్రాచుల పేరిట పలు హత్యలకు పాల్పడ్డారన్నారు. జిల్లాలో మన్నం ప్రసాద్, మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయులు కనకాచారి, మునెప్పలను హత్య చేశారన్నారు. పీజీ విద్యార్థులు మల్లేష్, మనోహర్‌లను మాయం చేశారనీ, ఇప్పటికీ వారి ఆచూకీ తెలియలేదని పేర్కొన్నారు. ప్రసాద్ హత్యకు గురైన పదిహేడేళ్ల తర్వాత తెలంగాణ పోలీసులు మద్దులూరి శేషయ్యను పట్టుకుంటే... విచారణ పేరిట ప్రకాశం పోలీసులు హడావుడి చేస్తున్నారని విమర్శించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఓపీడీఆర్ నాయకులు సీహెచ్.సుధాకరరావు, మన్నం ప్రసాద్ సోదరుడు ప్రసన్నరాజు తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IND vs PAK: పాక్ ఆటగాళ్లను భారత అభిమానులు ఎంతో గౌరవిస్తారు: ఉమర్ అక్మల్
-
India News
PM-KUSUM: ‘పీఎం కుసుమ్’ పథకం 2026 వరకు పొడిగింపు
-
Politics News
Arvind Kejriwal: రాజకీయాల్లో ‘ఆమ్ఆద్మీ’ సక్సెస్.. ఎందుకంటే..!
-
Sports News
IPL 2023: అప్పటికల్లా.. ఫుట్‌బాల్ లీగ్ కంటే అతిపెద్ద ఈవెంట్ ఐపీఎల్ అవుతుంది: స్ట్రాస్
-
World News
Hong Kong: 5 లక్షల విమాన టికెట్లు ఫ్రీ.. పర్యాటకులకు హాంకాంగ్ ఆఫర్!
-
Movies News
Pawan Kalyan: సినిమాల నుంచి అప్పుడే రిటైర్డ్ అవ్వాలనుకున్నా.. నా పెళ్లిళ్లు అనుకోకుండానే..!: పవన్ కల్యాణ్