logo

ఎయిమ్స్‌ ప్రవేశ పరీక్షలో జాతీయ స్థాయి ర్యాంకు

ఆల్‌ ఇండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌) ఆధ్వర్యంలో నవంబరు 6న జాతీయస్థాయిలో జరిగిన(డీఎం) సూపర్‌ స్పెషాలిటీ ప్రవేశ పరీక్షల్లో మార్కాపురం పట్టణానికి చెందిన డాక్టర్‌ గుర్రం సాయి శ్రీనివాస్‌ జాతీయస్థాయిలో రెండో ర్యాంక్‌ సాధించారు.

Published : 04 Dec 2022 05:23 IST

మార్కాపురం పట్టణం, న్యూస్‌టుడే: ఆల్‌ ఇండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌) ఆధ్వర్యంలో నవంబరు 6న జాతీయస్థాయిలో జరిగిన(డీఎం) సూపర్‌ స్పెషాలిటీ ప్రవేశ పరీక్షల్లో మార్కాపురం పట్టణానికి చెందిన డాక్టర్‌ గుర్రం సాయి శ్రీనివాస్‌ జాతీయస్థాయిలో రెండో ర్యాంక్‌ సాధించారు. ఈయన 2014వ సంవత్సరంలో నాటి ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఎంసెట్‌ ప్రవేశ పరీక్షలో ప్రథమ ర్యాంక్‌ సాధించారు. అనంతరం పాండిచ్చేరి లోని జిప్మర్‌ మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ పూర్తి చేసి అక్కడే ఎండీ కోర్సుకు జరిగిన ప్రవేశ పరీక్షలో తొలి ప్రయత్నంలోనే 7వ ర్యాంక్‌ సాధించారు. పిడియాట్రిక్స్‌, ఆప్తమాలజీ, మెడిసిన్‌ కోర్సుల్లో గోల్డ్‌ మెడల్‌ సాధించారు. ప్రస్తుతం ఈయన చేస్తున్న ఎండీ పిడియాట్రిక్స్‌ కోర్సు ఈనెల చివరికి పూర్తి కానుంది. ఎయిమ్స్‌ పరీక్షలో జాతీయస్థాయిలో రెండో ర్యాంక్‌ సాధించిన సాయి శ్రీనివాస్‌ 2023 జనవరి నుంచి డీఎం కోర్సులో చేరనున్నట్లు తెలిపారు. సాయి శ్రీనివాస్‌ తల్లిదండ్రులు గుర్రం మోహన్‌ రామ్‌, రాధికలు ఇద్దరూ డాక్టర్లు కావడం గమనార్హం. ఈ సందర్భంగా సాయి శ్రీనివాస్‌కు పట్టణంలోని వైద్యులు , ప్రముఖులు అభినందనలు తెలిపారు.

Read latest Prakasam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని