logo

బాత్‌రూంలో జారిపడి హెడ్‌కానిస్టేబుల్‌ మృతి

ప్రమాదవశాత్తు బాత్‌రూంలో జారి పడి తీవ్రగాయాల పాలై చికిత్స పొందుతూ హెడ్‌కానిస్టేబుల్‌ మృతిచెందాడు.

Published : 21 Jan 2023 04:05 IST

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: ప్రమాదవశాత్తు బాత్‌రూంలో జారి పడి తీవ్రగాయాల పాలై చికిత్స పొందుతూ హెడ్‌కానిస్టేబుల్‌ మృతిచెందాడు. జగద్గిరిగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ప్రకాశం జిల్లాకు చెందిన శ్రీమన్నారాయణ(40) హైదరాబాద్‌ నగరంలోని జగద్గిరిగుట్ట ఠాణాలో హెడ్‌కానిస్టేబుల్‌గా రెండేళ్లుగా పనిచేస్తున్నారు. స్థానిక విజయనగర్‌ కాలనీలో నివాసముంటున్నారు. గురువారం అర్ధరాత్రి 1.30కు ఇంట్లో బాత్‌రూంకు వెళ్లి ప్రమాదవశాత్తు జారి కిందపడ్డారు. తలకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే కుటుంబసభ్యులు కూకట్‌పల్లిలోని రాందేవ్‌రావు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆయన మృతిచెందారు. శ్రీమన్నారాయణకు భార్య ధనలక్ష్మి, కుమార్తెలు రోహిత, హర్షిణి ఉన్నారు. రోహిణి బీటెక్‌ చదువుతుండగా, హర్షిణి ఇంటర్‌ చదువుతోంది. 20 ఏళ్లుగా బాలానగర్‌ డివిజన్‌ పరిధిలోని పలు పోలీస్‌స్టేషన్‌లలో విధులు నిర్వర్తించారు. ఆయన మరణంతో ఠాణాలో విషాదఛాయలు అలముకున్నాయి. రాందేవ్‌రావు ఆసుపత్రిలో మృతదేహానికి పోలీసు ఉన్నతాధికారులు, జగద్గిరిగుట్ట పరిధిలోని వివిధ పార్టీల నాయకులు నివాళులు అర్పించారు.

22 చోరీల కేసులో నిందితుడి అరెస్టు

దుగ్గిరాల, న్యూస్‌టుడే: గుంటూరు జిల్లాలోని ఈమనిలో జరిగిన చోరీ కేసులో నిందితుడు అర్థవీడు మండలం మాగుటూరు గ్రామానికి చెందిన నల్లబోతుల లక్ష్మయ్యను గురువారంఅరెస్టు చేసినట్లు ఎస్సై శ్రీనివాసరెడ్డి తెలిపారు. గతేడాది మే 14న ఈమనిలోని చుక్కా మల్లికాంబ ఇంట్లో బంగారం, వెండి, నగదు అపహరించినట్లు చెప్పారు. ఆ సొత్తును మొత్తం స్వాధీనం చేసుకున్నామన్నారు. గుంటూరు, కృష్ణా, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో కలిసి అతను మరో 22 చోరీలు చేసినట్లు అంగీకరించాడని వివరించారు. ఎస్పీ ఆరిఫ్‌హపీÆజ్‌ ఉత్తర్వుల మేరకు గుంటూరు సీసీఎస్‌, మంగళగిరి డీఎస్పీ రాంబాబు, సీఐ భూషణం పర్యవేక్షణలో కేసును ఛేదించామన్నారు. నిందితుడిని శుక్రవారం తెనాలిలోని న్యాయస్థానంలో హాజరుపర్చగా రిమాండ్‌కు పంపినట్లు చెప్పారు.

Read latest Prakasam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని