logo

‘ఉద్యోగులను కించపరిచేలా బండి వ్యాఖ్యలు’

ఏపీజీఈఏ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్‌.సూర్యనారాయణపై ఏపీఎన్జీవో నాయకులు బురద జల్లుడు కార్యక్రమాన్ని ఆపకుంటే తామూ అదేస్థాయిలో స్పందించాల్సి వస్తుందని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు చిన్నపురెడ్డి కిరణ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు.

Published : 21 Jan 2023 04:05 IST

మాట్లాడుతున్న ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కిరణ్‌కుమార్‌రెడ్డి

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ఏపీజీఈఏ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్‌.సూర్యనారాయణపై ఏపీఎన్జీవో నాయకులు బురద జల్లుడు కార్యక్రమాన్ని ఆపకుంటే తామూ అదేస్థాయిలో స్పందించాల్సి వస్తుందని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు చిన్నపురెడ్డి కిరణ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా సమావేశం ఒంగోలు మండల తహసీల్దార్‌ కార్యాలయం ఆవరణలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కిరణ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడారు. వేళకు జీతభత్యాలు పొందడం అనేది ఉద్యోగుల హక్కుల్లో భాగమేనని అన్నారు. అందుకుగాను చట్టాన్ని అమలు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని గవర్నర్‌ను అడగడం ప్రజాస్వామ్యయుతమేనని చెప్పారు. కారుణ్య నియామకాల ద్వారా నియమితులైన ఉద్యోగులను కించపరిచేలా ఏపీఎన్జీవో నాయకుడు బండి శ్రీనివాసరావు మాట్లాడటాన్ని తప్పుబట్టారు. ఎన్జీవో సంఘం భవనాలను వ్యాపార కేంద్రాలుగా మార్చి ప్రభుత్వానికి జమాఖర్చులు చూపించకుండా పన్నులు ఎగవేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై ఇప్పటికే చేసిన ఫిర్యాదులకు తమ సంఘం కట్టుబడి ఉందన్నారు. ఎన్జీవో సంఘానికి దీటుగా బదులిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. సమావేశంలో సంఘం నాయకులు విజయభాను, రమణారావు, మసూద్‌అలీ, రాము, పాండు రంగారెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, అనిల్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని