logo

సందడిగా దామచర్ల జన్మదిన వేడుకలు

తెలుగు దేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ జన్మదిన వేడుకలు జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.

Updated : 21 Jan 2023 04:50 IST

సేవా కార్యక్రమాలు నిర్వహించిన తెదేపా శ్రేణులు

తోపుడు బండి అందిస్తున్న మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌.. చిత్రంలో నాయకులు, తెలుగు మహిళలు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: తెలుగు దేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ జన్మదిన వేడుకలు జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తొలుత నాయకులు, కార్యకర్తల మధ్య కేకు కోశారు. ఒంగోలు, కొండపి నియోజకవర్గాలతో పాటు, జిల్లాలోని ఇతర ప్రాంతాల నుంచి తెదేపా శ్రేణులు, ఆయన అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం అన్నదానం చేశారు. డీజేఆర్‌ ట్రస్టు తరఫున పది మంది పేదలకు తోపుడు బండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కొండపి ఎమ్మెల్యే డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి, మాజీ ఎమ్మెల్యేలు బీఎన్‌.విజయకుమార్‌, పాలపర్తి డేవిడ్‌రాజు, నారపుశెట్టి పాపారావు, దివి శివరాం, తెదేపా కందుకూరు నియోజకవర్గ బాధ్యుడు ఇంటూరి నాగేశ్వరరావు, ఒంగోలు నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు వినుకొండ సుబ్రహ్మణ్యం, నాయకులు పమిడి రమేష్‌, మంత్రి శ్రీనివాసరావు, కామేపల్లి శ్రీనివాసరావు, వైవీ.సుబ్బారావు తదితరులు జనార్దన్‌కు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. తొలుత టంగుటూరు మండలంంలోని వల్లూరమ్మ, అంగాల పరమేశ్వరమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. టంగుటూరులోని నివాసంలో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల సమక్షంలోనూ కేకు కోశారు.  ‌ ఒంగోలు బీకే అపార్ట్‌మెంట్‌లో నిర్వహించిన వేడుకల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన తెదేపా ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గ బాధ్యులు దామచర్లకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. వీరిలో అద్దంకి, పర్చూరు ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్‌, ఏలూరి సాంబశివరావు, మాజీ ఎమ్మెల్యేలు కందుల నారాయణరెడ్డి, ముత్తుమల ఆశోక్‌రెడ్డి, ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, యర్రగొండపాలెం, చీరాల పార్టీ బాధ్యులు గూడూరి ఎరిక్షన్‌బాబు, ఎం.ఎం.కొండయ్య, తెలుగు మహిళా ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షురాలు రావుల పద్మజ, కార్యదర్శి మండుల లావణ్య, నాయకులు పుల్లంశెట్టి మణి, దివి రోశయ్య, గుమ్మడి సాయిబాబు, వలివర్తి శేషంరాజు, పి.అనిల్‌కుమార్‌, సురేష్‌బాబు, లక్ష్మీనారాయణ, శ్రీనివాసరావు, శ్రీకాంత్‌బాబు తదితరులున్నారు.

Read latest Prakasam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని