logo

రహదారిపై గ్రానైట్‌ రాళ్ల లారీ బోల్తా

సింగరాయకొండ మండలంలోని కనుమళ్ల జాతీయ రహదారి వద్ద ఆదివారం వేకువజామున 3 గంటల సమయంలో గ్రానైట్‌ బండలు తరలిస్తున్న టిప్పర్‌ బోల్తా కొట్టింది.

Published : 23 Jan 2023 02:30 IST

జాతీయ రహదారిపై పడిన గ్రానైట్‌ రాళ్లను క్రేన్‌తో తొలగిస్తున్న దృశ్యం

సింగరాయకొండ మండలంలోని కనుమళ్ల జాతీయ రహదారి వద్ద ఆదివారం వేకువజామున 3 గంటల సమయంలో గ్రానైట్‌ బండలు తరలిస్తున్న టిప్పర్‌ బోల్తా కొట్టింది. ఎస్సై ఫిరోజ ఫాతిమా తెలిపిన వివరాల మేరకు చీమకుర్తి నుండి రామాయపట్నం పోర్టుకు గ్రానైట్‌ రాళ్లను తరలిస్తున్న లారీ చోదకుడు నిద్రమత్తులో రహదారి మధ్యలోని సిమెంటు దిమ్మెను ఢీకొట్టాడు. దీంతో వ్యతిరేక దిశలోకి లారీ వచ్చి బోల్తాపడింది. దీంతో బండ రాళ్లు రోడ్డుపై చల్లాచెదురుగా పడ్డాయి. ఆ సమయంలో ఎటువంటి వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని, చోదకుడు సైతం సురక్షితంగా ఉన్నారని ఎస్సై తెలిపారు. హైవే పోలీసులు రహదారిపై పడిన బండరాళ్లను క్రేన్‌ సాయంతో తొలగించి రవాణాకు అంతరాయం లేకుండా చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.

- న్యూస్‌టుడే, సింగరాయకొండ గ్రామీణం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు