logo

నిబంధనల మేరకే రాళ్లు తరలించాలి

చీమకుర్తి నుంచి రామాయపట్నం ఓడరేవు నిర్మాణానికి రాళ్లను తరలిస్తున్న లారీల వారు రహదారి భద్రతా నియమాలు కచ్చితంగా పాటించాలని ఒంగోలు డీఎస్పీ యు.నాగరాజు పేర్కొన్నారు.

Published : 26 Jan 2023 02:56 IST

మాట్లాడుతున్న డీఎస్పీ నాగరాజు, చిత్రంలో ఇతర అధికారులు

చీమకుర్తి, న్యూస్‌టుడే: చీమకుర్తి నుంచి రామాయపట్నం ఓడరేవు నిర్మాణానికి రాళ్లను తరలిస్తున్న లారీల వారు రహదారి భద్రతా నియమాలు కచ్చితంగా పాటించాలని ఒంగోలు డీఎస్పీ యు.నాగరాజు పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా టిప్పర్లలో అనుమతికి మించిన బరువుతో రాళ్లను తరలిస్తున్నారు. వీటి కారణంగా తరచూ ప్రమాదాలు చోటుచేసుకుని... పలువురు మృత్యువాత పడుతున్నారు. ఈ విషయమై పత్రికల్లోనూ కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ నేపథ్యంలో చీమకుర్తిలోని బీవీఎస్‌ఆర్‌ కల్యాణ మండపంలో వివిధ శాఖల ఆధ్వర్యంలో బుధవారం అవగాహనా సదస్సు నిర్వహించారు. సదస్సులో డీఎస్పీ నాగరాజు, మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ జయప్రకాష్‌ మాట్లాడుతూ... రాళ్లను తరలించే లారీల డ్రైవర్లు విధిగా భారీ వాహనాల లైసెన్సు కలిగి ఉండాలన్నారు. పరిమితికి మించి లోడు వేయరాదని... పైన పట్ట కట్టి మాత్రమే రవాణా చేయాలని స్పష్టం చేశారు. లారీల్లో తప్పనిసరిగా ఇద్దరు చోదకులు ఉండాలని... మితి మీరిన వేగంతో ప్రయాణించరాదని పేర్కొన్నారు. రహదారి అంచుల్లో వాహనాలు నిలపరాదన్నారు. చోదకులు, యజమానులు ఈ సూచనలు తప్పనిసరిగా పాటించి ప్రమాదాల నివారణకు సహకరించాలన్నారు. గ్రామీణ సీఐ రాంబాబు అధ్యక్షతన నిర్వహించిన సదస్సుల్లో గనుల శాఖ రాయల్టీ ఇన్‌స్పెక్టర్‌ శ్రీకాంత్‌, ఎస్సై వి.ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు