logo

గణతంత్ర సంబరాలకు ఏర్పాట్లు

ఒంగోలులోని పోలీసు కవాతు మైదానంలో గురువారం గణతంత్ర దినోత్సవం నిర్వహించనున్నారు.

Published : 26 Jan 2023 02:56 IST

సాయుధ బలగాల సన్నద్ధత కార్యక్రమాన్ని పరిశీలించి
గౌరవ వందనం స్వీకరిస్తున్న ఎస్పీ మలికా గార్గ్‌

ఒంగోలు ట్రంకురోడ్డు, ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ఒంగోలులోని పోలీసు కవాతు మైదానంలో గురువారం గణతంత్ర దినోత్సవం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లను బుధవారం కలెక్టర్‌ దినేష్‌కుమార్‌, ఎస్పీ మలికా గార్గ్‌ పరిశీలించారు. ఉదయం సాయుధ బలగాలు నమూనా ప్రదర్శనను నిర్వహించాయి. ఎస్పీ కవాతును పరిశీలించి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మైదానంలో వివిధ స్టాళ్లు ఏర్పాటుచేస్తున్నారు. శకటాలు తుది మెరుగులు దిద్దుకున్నాయి. అధికారులు, విద్యార్థుల కోసం ప్రత్యేక షామియానాలు సిద్ధంచేశారు. 

పోలీస్‌ కవాతు మైదానంలో ఏర్పాట్లు

322 మందికి ఉత్తమ ప్రశంసాపత్రాలు

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లాలోని పలు శాఖలకు చెందిన 322 మంది ఉద్యోగులను ప్రశంసాపత్రాలకు ఎంపిక చేశారు. ఆయా శాఖల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా వారి పేర్లను సిఫార్సు చేశారు. జిల్లా అధికారులలో ఎస్‌.సరళా వందనం(ప్రత్యేక కలెక్టర్‌), విశ్వేశ్వరరావు(ఆర్డీవో, ఒంగోలు); ఎం.శ్రీదేవి(ఎస్‌డీసీ); ఎం.రజనీకుమారి(జిల్లా సైనిక సంక్షేమశాఖ అధికారిణి); జి.అర్చన(విభిన్న ప్రతిభావంతుల సంక్షేమశాఖ ఏడీ); టి.ఉషారాణి(జిల్లా గ్రామ, వార్డు సచివాలయాల ఇన్‌ఛార్జి); బి.కృష్ణవేణి(డీటీసీ) ఉన్నారు. వీరు ఒంగోలులోని పోలీసు కవాతు మైదానంలో గురువారం కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు అందుకోనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని