logo

అర్హులంతా ఓటు వినియోగించుకోవాలి

ఓటు వినియోగం విషయంలో మన ఆలోచన, ప్రవర్తనను బట్టే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.భారతి అన్నారు.

Published : 26 Jan 2023 02:56 IST

ప్రతిజ్ఞ చేయిస్తున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.భారతి..
చిత్రంలో కలెక్టర్‌ దినేష్‌కుమార్‌, జేసీ అభిషిక్త్‌ కిషోర్‌,
జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి శ్యాంబాబు తదితరులు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ఓటు వినియోగం విషయంలో మన ఆలోచన, ప్రవర్తనను బట్టే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.భారతి అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రకాశం భవన్‌లోని స్పందన సమావేశ మందిరంలో బుధవారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె మాట్లాడుతూ రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును అర్హులంతా వినియోగించుకోవాలన్నారు. ఇప్పటికే ఓటరుగా ఉన్నవారు జాబితాలో పేరు ఉందో, లేదో నిర్ధారించుకోవాలని సూచించారు. కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలను అనుసరించి జిల్లా యంత్రాంగం వివిధ స్థాయిల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. సంయుక్త కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్‌ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటే అత్యంత శక్తిమంతమైన ఆయుధమన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి శ్యాంబాబు మాట్లాడుతూ ప్రజాస్వామ్య ప్రభుత్వాలను ఎన్నుకునే ప్రక్రియలో మరింత మంది భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కొత్త ఓటర్లకు గుర్తింపు కార్డులను అందజేశారు. సీనియర్‌ సిటిజన్లు, ఎక్కువ దఫాలు ఓటుహక్కు వినియోగించుకున్నవారిని సత్కరించారు. సమావేశంలో డీఆర్వో ఓబులేసు, ఒంగోలు ఆర్డీవో విశ్వేశ్వరరావు, జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధికారి లక్ష్మానాయక్‌ తదితరులు పాల్గొన్నారు. తొలుత ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ఆధార్‌ అనుసంధాన ప్రక్రియలో పురోగతి కనబరిచిన ఒంగోలు, అర్ధవీడు, కొమరోలు మండల తహసీల్దార్లు మురళి, రవిబాబు, రమాదేవి, మరో 10 మంది బీఎల్వోలకు ప్రశంసాపత్రాలు అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని