logo

గడప గడపలో అపశ్రుతి

ముండ్లమూరు మండలంలోని చింతలపూడి గ్రామంలో బుధవారం శాసనసభ్యుడు మద్దిశెట్టి వేణుగోపాల్‌ నిర్వహించిన ‘గడప గడపకు మన ప్రభుత్వం’లో అపశ్రుతి చోటుచేసుకుంది.

Published : 26 Jan 2023 02:56 IST

గేదె దూసుకురావడంతో కిందపడిన ఎమ్మెల్యే.. మరో ఇద్దరికి గాయాలు

గేదె జనంలోకి రావడంతో సమీప భవనం పైకి వెళ్తున్న మద్దిశెట్టి

ముండ్లమూరు, న్యూస్‌టుడే: ముండ్లమూరు మండలంలోని చింతలపూడి గ్రామంలో బుధవారం శాసనసభ్యుడు మద్దిశెట్టి వేణుగోపాల్‌ నిర్వహించిన ‘గడప గడపకు మన ప్రభుత్వం’లో అపశ్రుతి చోటుచేసుకుంది. బుధవారం ఈ కార్యక్రమంలో భాగంగా చంద్రమౌళి అనే వ్యక్తి ఇంటికి మద్దిశెట్టి వెళ్లారు. అదే సమయంలో ఇంటి ముందు ఉన్న గేదె అక్కడి జనాలను చూసి బెదిరింది. తాడు తెంచుకొని దూసుకురావడంతో జనం పరుగులు తీశారు. ఈ క్రమంలో మద్దిశెట్టి కిందపడిపోయారు. వెంటనే తేరుకోని పక్కకు వెళ్లడంతో ప్రమాదం తప్పింది. గేదె ఢీకొనడంతో ఎంపీటీసీ సభ్యుడు దాసరి పెద్దఅంజయ్య, చంద్రమౌళికి స్వల్ప గాయాలయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని