logo

వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి మృతి

మండలంలోని పలుగుంటిపల్లెలో ట్రాక్టర్‌ పై నుంచి జారి పడి పూల వెంకటసుబ్బమ్మ (37) అనే మహిళ మృతి చెందింది.

Published : 27 Jan 2023 02:13 IST

రాచర్ల, న్యూస్‌టుడే : మండలంలోని పలుగుంటిపల్లెలో ట్రాక్టర్‌ పై నుంచి జారి పడి పూల వెంకటసుబ్బమ్మ (37) అనే మహిళ మృతి చెందింది.  మిరప కోతలకు వెళ్లేందుకు వెంకటసుబ్బమ్మ  ట్రాక్టర్‌లో బయలుదేరారు. ఆమె డ్రైవర్‌ వెనుక ఉన్న చెక్కపై కూర్చుంది. డ్రైవర్‌ వేగంగా, అజాగ్రత్తగా  ట్రాక్టర్‌ను నడపడటంతో ఆమె జారి కింద పడి పోయింది. ఈ ప్రమాదంలో ఆమె పై నుంచి ట్రాలీ టైరు వెళ్లడంతో తీవ్రంగా గాయపడింది.. ఆమెను గిద్దలూరు లోని ఒక ప్రైవేటు వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వెంకట సుబ్బమ్మకు భర్త, ఓ కుమార్తె ఉన్నారు. రాచర్ల ఏఎస్‌ఐ ఆదిశేషయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

నిమ్మకాయలు అమ్ముకుని తిరిగి వెళ్తుండగా...: పుల్లలచెరువు, న్యూస్‌టుడే:  ద్విచక్రవాహనాలు ఢీ కొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన గురువారం మండలంలోని నరజాముల తండా సమీపంలో చోటుచేసుకుంది.  యర్రగొండపాలెం మండలం వీరాయపాలెం గ్రామానికి చెందిన ఊసా చిన్న యోగయ్య(50) తన స్వగ్రామం నుంచి వచ్చి తండాల్లో నిమ్మకాయలు అమ్ముకుని తిరిగి వెళుతుండేవారు. గురువారం ఉదయం నిమ్మకాయలను తీసుకొని ద్విచక్రవాహనంపై బయలుదేరారు. పొగ మంచు అధికంగా కురుస్తుండటంతో. ఎదురుగా వస్తున్న వాహనాలు ఏవీ కనిపించ లేదు. ఎదురుగా నాగేశ్వరరావు నాయక్‌ అనే వ్యక్తి ద్విచక్రవాహనంపై రావడంతో రెండు వాహనాలు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో చిన్న యోగయ్య తీవ్రంగా గాయపడ్డారు. యోగయ్య వెనుక వస్తున్న అతని తమ్ముడు క్షతగాత్రులను యర్రగొండపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యోగయ్య పరిస్థితి విషమంగా ఉండటంతో అతడిని వెంటనే గుంటూరు ఆసుపత్రికి తరలించే క్రమంలో మార్గ మధ్యలో మృతి చెందాడు. యోగయ్యకు భార్య, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. గాయపడ్డ నాగేశ్వరరావు నాయక్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సమాచారం అందుకున్న ఎస్సై వేముల సుధాకర్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని