logo

ఒంగోలు - కొలరాడో

అమెరికాలోని కొలరాడో రాష్ట్రానికి చెందిన మేరీహాల్‌, డొనాల్డ్‌ హాల్‌ దంపతులు ఒంగోలు సారా ఎన్జీవో హోంలోని ధనుష్‌ను దత్తత తీసుకున్నారు.

Updated : 28 Jan 2023 05:28 IST

బాలుడు ధనుష్‌ను అధికారులు, స్వచ్ఛంద సంస్థ సభ్యుల సమక్షంలో

మేరీహాల్‌, డొనాల్డ్‌ హాల్‌ దంపతులకు అప్పగిస్తున్న కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌

అమెరికాలోని కొలరాడో రాష్ట్రానికి చెందిన మేరీహాల్‌, డొనాల్డ్‌ హాల్‌ దంపతులు ఒంగోలు సారా ఎన్జీవో హోంలోని ధనుష్‌ను దత్తత తీసుకున్నారు. ఒంగోలు కలెక్టరేట్‌లోని క్యాంపు కార్యాలయంలో కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ చేతుల మీదుగా శుక్రవారం ఈ ప్రక్రియ సాగింది. డొనాల్డ్‌ హాల్‌ దంపతులు మూడేళ్ల క్రితం దత్తత కోసం దరఖాస్తు చేసుకున్నారు. కొవిడ్‌ కారణంగా వీసా తదితర ప్రక్రియలో జాప్యం చోటుచేసుకుంది. ఎనిమిదేళ్ల వయసు కలిగిన ధనుష్‌కు పుట్టినప్పటి నుంచి పాక్షిక పక్షవాతంతో బాధపడుతున్నాడు. శరీరంలోని సగ భాగం పనిచేయదు. ఈ స్థితి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. బాలుడి అప్పగింత కార్యక్రమంలో రాష్ట్ర బాలల హక్కుల కమిషన్‌ సభ్యురాలు బత్తుల పద్మావతి, జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారిణి ధనలక్ష్మి, జిల్లా బాలల సంరక్షణ అధికారి దినేష్‌ కుమార్‌, సీడబ్ల్యూసీ సభ్యురాలు వంశీలత తదితరులు పాల్గొన్నారు.

న్యూస్‌టుడే, ఒంగోలు గ్రామీణం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని