logo

నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత అభినందన

గిద్దలూరు మండలం అంబవరానికి చెందిన ఏడేళ్ల చిన్నారిపై అదే గ్రామానికి చెందిన దూదేకుల సిద్ధయ్య అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడి హత్య చేశాడు.

Published : 28 Jan 2023 02:47 IST

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: గిద్దలూరు మండలం అంబవరానికి చెందిన ఏడేళ్ల చిన్నారిపై అదే గ్రామానికి చెందిన దూదేకుల సిద్ధయ్య అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని ప్లాస్టిక్‌ గోతాంలో కట్టి సైకిల్‌పై తీసుకెళ్లి పంట కాలువలో పడేసి పరారయ్యాడు. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు 18 నెలల వ్యవధిలోనే నిందితుడ్ని అరెస్టు చేసి న్యాయస్థానంలో ప్రవేశపెట్టి ఛార్జిషీటు దాఖలు చేశారు. సాక్ష్యాదారాలు పక్కాగా ఉండటం, నేరం నిరూపితం కావడంతో సిద్ధయ్యకు మరణశిక్ష(చనిపోయేంత వరకూ ఉరి) విధిస్తూ పోక్సో కోర్టు న్యాయమూర్తి సోమశేఖర్‌ ఇటీవల తీర్పు చెప్పారు. విషయం తెలుసుకున్న ప్రముఖ బాలల హక్కుల ఉద్యమకారుడు, నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత కైలాశ్‌ సత్యార్థి ఎస్పీ మలికా గార్గ్‌కు శుక్రవారం ఫోన్‌ చేశారు. పోక్సో కేసులో స్వీయ పర్యవేక్షణ చేసి నిందితుడికి శిక్ష పడటంలో కృషి చేసినందుకు అభినందించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు