logo

ఈపీఎఫ్‌ సేవలు మరింత సరళతరం

ఉద్యోగులు, పింఛనుదారుల సౌకర్యార్థం వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఈపీఎఫ్‌వో జిల్లా కమిషనర్‌ సతీష్‌కుమార్‌ తెలిపారు.

Published : 28 Jan 2023 02:47 IST

మాట్లాడుతున్న కమిషనర్‌ సతీష్‌కుమార్‌, చిత్రంలో వివిధ సంస్థల అధికారులు

ఈనాడు డిజిటల్‌, ఒంగోలు: ఉద్యోగులు, పింఛనుదారుల సౌకర్యార్థం వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఈపీఎఫ్‌వో జిల్లా కమిషనర్‌ సతీష్‌కుమార్‌ తెలిపారు. ‘నిధి ఆప్కే నికత్‌ 2.0’ పేరిట కో ఆపరేటివ్‌ బ్యాంకు సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు. ఇకపై పింఛనర్లు, ఉద్యోగుల సమస్యలను ఏరోజుకారోజు పరిష్కరించే అవకాశం ఉంటుందన్నారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే నేరుగా జిల్లా కార్యాలయంలో సంప్రదించవచ్చన్నారు. జిల్లా నోడల్‌ అధికారి, నిధి ఆప్కే నికత్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి ఎం.సమ్మయ్య... కార్యక్రమ ఉద్దేశం, ఆన్‌లైన్‌లో కార్యకలాపాల నిర్వహణపై అవగాహన కల్పించారు. యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌, ఓటీపీ వంటి వివరాలను ఇతరులతో పంచుకోరాన్నారు. ఈ-ఆఫీస్‌ సేవలు సైతం అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. పీడీసీసీ బ్యాంకు సీఈవో రాఘవయ్య, కార్మిక శాఖ సహాయ కమిషనర్లు పవన్‌కుమార్‌, అనితావాణి, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సహాయ సూపరింటెండెంట్‌ సుధీర్‌బాబు, ఏపీసీవోబీ డీజీఎం రాంబాబునాయక్‌, పీసీడీసీ బ్యాంకు డీజీఎం విజయలక్ష్మి, ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ మేనేజర్‌ పీవీ సుధీర్‌ మాట్లాడారు. గతంతో పోల్చితే ఈపీఎఫ్‌వో సేవలు చాలా మెరుగుపడ్డాయన్నారు. ఉద్యోగులు, పింఛనర్లకు ఆయా అంశాలపై అవగాహన కల్పించి త్వరితగతిన సమస్యలు పరిష్కరించడం గొప్ప విషయమన్నారు. ఈపీఎఫ్‌వో అధికారి డీసీ రామారావు, సిబ్బంది, పెద్ద సంఖ్యలో ఉద్యోగులు, పింఛనర్లు, ఆయా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించి వెనువెంటనే పరిష్కరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని