logo

త్రిముఖ దుర్గాంబ సేవలో న్యాయమూర్తులు

జిల్లాలో ప్రసిద్ధి గాంచిన శైవ పుణ్యక్షేత్రం, పర్యాటక కేంద్రం భైరవకోనను జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.భారతి, వారి కుమారులు కనిగిరి జూనియర్‌ సివిల్‌ న్యాయమూర్తి భరత్‌ చంద్ర శుక్రవారం దర్శించారు.

Published : 28 Jan 2023 02:47 IST

ఆలయానికి వెళ్లే మార్గంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారతి, కనిగిరి జడ్జి భరత్‌ చంద్ర, ఇతర అధికారులు

సీఎస్‌పురం, న్యూస్‌టుడే: జిల్లాలో ప్రసిద్ధి గాంచిన శైవ పుణ్యక్షేత్రం, పర్యాటక కేంద్రం భైరవకోనను జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.భారతి, వారి కుమారులు కనిగిరి జూనియర్‌ సివిల్‌ న్యాయమూర్తి భరత్‌ చంద్ర శుక్రవారం దర్శించారు. జలపాతాన్ని వీక్షించి, కాల భైరవేశ్వర స్వామి, త్రిముఖ దుర్గాంబను దర్శించుకుని వారు మొక్కులు తీర్చుకున్నారు. ఈవో నర్రా నారాయణరెడ్డి, అర్చకులు స్వామి వారి శేష వస్త్రాలను అందించారు. వారి వెంట సీఎస్‌పురం, హనుమంతునిపాడు ఎస్సైలు పి.అనిల్‌ కుమార్‌, కృష్ణపావని, ఆలయ సిబ్బంది ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు