logo

రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడితే ఊరుకోం...

విభజన హామీల అమలులో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నమ్మక ద్రోహం చేసిందని సీపీఎం రాష్ట్ర నాయకుడు వి.కృష్ణయ్య విమర్శించారు.

Published : 28 Jan 2023 02:47 IST

ప్రదర్శనలో పాల్గొన్న వామపక్ష, విద్యార్థి, యువజన సంఘాల నాయకులు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: విభజన హామీల అమలులో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నమ్మక ద్రోహం చేసిందని సీపీఎం రాష్ట్ర నాయకుడు వి.కృష్ణయ్య విమర్శించారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోరుతూ వామపక్ష, విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన బస్సు యాత్ర శుక్రవారం రాత్రి ఒంగోలు చేరుకుంది. మంగమూరు రోడ్డు కూడలి నుంచి సాయిబాబా గుడి వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో కృష్ణయ్య మాట్లాడారు. పాలకులు తమ స్వలాభం, పదవుల కోసం రాష్ట్ర యువత ప్రయోజనాలను తాకట్టు పెడుతోందని.. ఈ పద్ధతిని చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. అందుకే యువతకు ఉద్యోగావకాశాలు, ఉపాధి కల్పించాలని సమరయాత్ర చేపట్టినట్టు తెలిపారు. సభలో పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి ఎల్‌.రాజశేఖర్‌, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్నకుమార్‌, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు జన్సాన్‌బాబు, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న, సీపీఎం జిల్లా కార్యదర్శి హనీఫ్‌, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం.ఎల్‌.నారాయణ, వామపక్ష నాయకులు కంకణాల ఆంజనేయులు, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని