logo

విద్వేషాలతో జాతి మనుగడకు ప్రమాదం

ప్రజలంతా సోదరభావంతో కలిసి ముందుకు సాగాలని జయహో సంస్థ జాతీయ అధ్యక్షుడు విజయ శంకర స్వామి పేర్కొన్నారు.

Published : 29 Jan 2023 02:02 IST

మాట్లాడుతున్న విజయ శంకర స్వామి, చిత్రంలో జయహో సంస్థ సభ్యులు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రజలంతా సోదరభావంతో కలిసి ముందుకు సాగాలని జయహో సంస్థ జాతీయ అధ్యక్షుడు విజయ శంకర స్వామి పేర్కొన్నారు. ఒంగోలులోని మల్లయ్య లింగం భవన్‌లో శనివారం నిర్వహించిన సంస్థ జిల్లా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో మత ద్వేషాలు రోజురోజుకూ పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయా మతాల సారాన్ని సరిగా అర్థం చేసుకోకుండా కొందరు విద్వేషాలు రెచ్చగొడుతున్నారని పేర్కొన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే జాతి మనగడ కష్టమవుతుందన్నారు. అన్ని మతాలు ప్రేమనే బోధించాయన్న విషయాన్ని గుర్తించాలన్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శి అహ్మద్‌ అభిలాష్‌ మాట్లాడుతూ... ఏటా డిసెంబర్‌ 19 నుంచి జనవరి 30 వరకు ఐక్యతా దినాలుగా పాటిస్తూ, దేశ వ్యాప్తంగా హిందూ ముస్లింల సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో సంఘం నాయకులు లోక్‌నాథ్‌, సలార్‌, అబ్దుల్‌ రెహ్మాన్‌, జిలానీ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని