logo

భూ సేకరణ ప్రక్రియ వేగవంతం

వెలిగొండ ప్రాజెక్ట్‌ పునరావస కాలనీల్లో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని భూ సేకరణ విభాగం ప్రత్యేక కలెక్టర్‌ సరళా వందనం పేర్కొన్నారు.

Published : 29 Jan 2023 02:02 IST

మాట్లాడుతున్న ప్రత్యేక కలెక్టర్‌ సరళా వందనం, చిత్రంలో    కనిగిరి ఆర్డీవో సందీప్‌కుమార్‌

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: వెలిగొండ ప్రాజెక్ట్‌ పునరావస కాలనీల్లో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని భూ సేకరణ విభాగం ప్రత్యేక కలెక్టర్‌ సరళా వందనం పేర్కొన్నారు. జిల్లాలోని పలు ప్రాజెక్టుల భూ సేకరణ ప్రక్రియపై ప్రకాశం భవన్‌లో శనివారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. సచివాలయ, ఆర్‌బీకే, డిజిటల్‌ గ్రంథాలయాల నిర్మాణానికి ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీల్లో స్థలాలు కేటాయించాలన్నారు. తీగలేరుకు సంబంధించి యర్రగొండపాలెం, పుల్లలచెరువు మండలాల్లో ప్రభుత్వ, అసైన్డ్‌ భూములు గుర్తించాలన్నారు. డీఆర్వో ఓబులేసు మాట్లాడుతూ... బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణానికి పీసీపల్లి, పామూరు ప్రాంతాల్లో భూ సేకరణ పూర్తి చేయాలన్నారు. 544డీ రహదారికి సంబంధించి కంభం, బేస్తవారపేట, కొమరోలు మండలాల్లో భూ సేకరణ విషయమై పలు సూచనలు చేశారు. చీరాల రోడ్డు కింద వేటపాలెం, చినగంజాం ప్రాంతాల్లో భూములు కోల్పోయిన రైతులను గుర్తించి పరిహారం అందజేయాలన్నారు. ఆర్డీవో సందీప్‌కుమార్‌, రెవెన్యూ, సర్వే, జాతీయ రహదారి అధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని