logo

ఖోఖో, కబడ్డీ విజేత ‘విజయనగరం’

కంచర్ల ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు విజయనగరం జిల్లా కేంద్రంలోని రాజీవ్‌ మైదానంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఖోఖో, కబడ్డీ పోటీలు శనివారం రాత్రి ముగిశాయి.

Published : 29 Jan 2023 02:02 IST

గెలుపొందిన విజయనగరం కబడ్డీ జట్టు

విజయనగరం క్రీడలు, న్యూస్‌టుడే: కంచర్ల ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు విజయనగరం జిల్లా కేంద్రంలోని రాజీవ్‌ మైదానంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఖోఖో, కబడ్డీ పోటీలు శనివారం రాత్రి ముగిశాయి. ఖోఖో, కబడ్డీ రెండింట్లోనూ విజయనగరం జట్టు ప్రథమ స్థానంలో నిలిచింది. విజేతలకు కబడ్డీ, ఖోఖో సంఘ నాయకులు ట్రోఫీలు, నగదు బహుమతిని అందజేశారు. ఖోఖోలో ద్వితీయస్థానంలో ప్రకాశం, తృతీయస్థానాన్ని విశాఖపట్నం, నాల్గో స్థానం తూర్పుగోదావరి, కబడ్డీలో ద్వితీయ స్థానాన్ని నెల్లిమర్ల, తృతీయ స్థానాన్ని అలుగోలు, నాలుగో స్థానాన్ని విశాఖపట్నం ఎల్‌డీ స్పోర్ట్స్‌ క్లబ్‌ నిలిచాయి. ప్రథమస్థానంలో నిలిచిన జట్టుకు రూ.30వేలు, ద్వితీయ స్థానానికి రూ.20వేలు, తృతీయ, నాల్గో స్థానాల్లో నిలిచిన వారికి చెరో రూ.15వేల చొప్పున నగదు బహుమతులు అందజేశారు. టోర్నమెంట్‌ నిర్వాహకులు కేకే కుమార్‌(అమెరికా), కబడ్డీ సంఘం అధ్యక్షుడు కౌశిక్‌ ఈశ్వర్‌, రంగారావు దొర, ఖోఖో సంఘం నాయకులు పి.చిన్నంనాయుడు, సత్యనారాయణ, వ్యాయామ ఉపాధ్యాయులు కె.గోపాల్‌, బాలకృష్ణ, ప్రతినిధులు పతివాడ శ్రీనివాసరావు(పోస్టల్‌), కార్పొరేటర్‌ ఎస్‌వీవీ రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని