logo

మార్కాపురం వాసికి అసోం ‘శిశు మిత్ర’అవార్డు

మార్కాపురం పట్టణానికి చెందిన ఐపీఎస్‌ అధికారి వీవీ రాకేష్‌ రెడ్డిని అసోం రాష్ట్ర ప్రభుత్వం శిశుమిత్ర అవార్డుకు ఎంపిక చేసింది.

Published : 29 Jan 2023 02:02 IST

అసోం డీజీపీ చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న ఎస్పీ రాకేష్‌రెడ్డి

మార్కాపురం నేర విభాగం న్యూస్‌టుడే: మార్కాపురం పట్టణానికి చెందిన ఐపీఎస్‌ అధికారి వీవీ రాకేష్‌ రెడ్డిని అసోం రాష్ట్ర ప్రభుత్వం శిశుమిత్ర అవార్డుకు ఎంపిక చేసింది. శుక్రవారం రాత్రి బొంగైగావ్‌ జిల్లా గ్రంథాలయంలో అసోం ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమంలో ఆ రాష్ట్ర డీజీపీ భాస్కర్‌ జ్యోతి మహంత చేతుల మీదుగా ఈ అవార్డును ఆయన అందుకున్నారు. దీనిపై రాకేష్‌ రెడ్డి తండ్రి వీరారెడ్డి మాట్లాడుతూ తన కుమారుడు 2014లో ఐపీఎస్‌ అధికారి అయ్యారని, అసోం కేడర్‌కు ఎంపికైన ఆయన ప్రస్తుతం గోల్పుర జిల్లా ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. బాలల హక్కులను కాపాడటంతో పాటు బానిసత్వం నుంచి వారిని దూరం చేసి ఉన్నత శిఖరాలకు చేరుకునేందుకు వీలుగా పిల్లలను ప్రోత్సహించే విధంగా చేసేందుకు 2019లో శిశు మిత్ర అనే కార్యక్రమానికి ప్రవేశపెట్టింది. కింది స్థాయి సిబ్బందికి ఎప్పటికప్పుడు బాలల హక్కులు, వేధింపుల నిరోధించి దిశా నిర్దేశం చేసి పిల్లలు ఎలాంటి విషయాల్లో మనస్తాపానికి గురవుతున్నారో గుర్తించి వాటిని నిరోధించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్త పై తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి రాకేష్‌ రెడ్డి ప్రత్యేక చొరవ చూపారు. ఇందుకుగాను ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ అవార్డుకు ఎంపిక చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని