logo

74.84 ఎకరాల్లో రిజిస్ట్రేషన్ల నిలిపివేత

మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ అనుమతి లేకుండా స్థిరాస్తి వ్యాపారులు పట్టా, అసైన్డ్‌ భూముల్లో వేసిన అక్రమ వెంచర్లపై ‘ఈనాడు’లో వరుస కథనాలకు ఉన్నతాధికారులు స్పందించారు.

Published : 29 Jan 2023 02:02 IST

కనిగిరి, న్యూస్‌టుడే: మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ అనుమతి లేకుండా స్థిరాస్తి వ్యాపారులు పట్టా, అసైన్డ్‌ భూముల్లో వేసిన అక్రమ వెంచర్లపై ‘ఈనాడు’లో వరుస కథనాలకు ఉన్నతాధికారులు స్పందించారు. ఈ నెల 25న సైతం ‘అక్రమ వెంచర్లకు అడ్డుకట్ట ఎక్కడ’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన కలెక్టర్‌, జిల్లా అధికారుల ఆదేశాలతో కమిషనర్‌ నారాయణరావు కనిగిరి పట్టణ పరిధిలోని అనుమతి లేకుండా 13 లేఅవుట్లలో వేసిన 74.84 ఎకరాలను గుర్తించారు. వీటిలో క్రయ విక్రయాలు జరపకూడదని ఆయా సర్వేనంబర్లలో ఎలాంటి రిజిస్ట్రేషన్లు చేయకూడదని డీటీసీకి శుక్రవారం రాత్రి నివేదిక పంపినట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని