logo

ఎస్సీ, ఎస్టీ కేసు నీరుగారుస్తున్నారని ఆందోళన

కొండపి మండలం కె.ఉప్పలపాడుకు చెందిన ఎస్సీ, ఎస్టీ కేసులో నిందితులను తక్షణమే అరెస్ట్‌ చేయాలంటూ అంబేడ్కర్‌ ఆశయ సాధన సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ సమీపంలోని విగ్రహం వద్ద శనివారం నిరసన చేపట్టారు.

Published : 29 Jan 2023 02:02 IST

ప్రదర్శనగా సాగుతున్న అంబేడ్కర్‌ ఆశయ సాధన సమితి సభ్యులు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: కొండపి మండలం కె.ఉప్పలపాడుకు చెందిన ఎస్సీ, ఎస్టీ కేసులో నిందితులను తక్షణమే అరెస్ట్‌ చేయాలంటూ అంబేడ్కర్‌ ఆశయ సాధన సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ సమీపంలోని విగ్రహం వద్ద శనివారం నిరసన చేపట్టారు. సమితి రాష్ట్ర అధ్యక్షుడు బిళ్లా చెన్నయ్య మాట్లాడుతూ... గ్రామంలోని ఎస్సీ, ఎస్టీ కేసును నీరుగార్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. నిందితులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్న అధికారులను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కేసులో సాక్ష్యంగా ఉన్న దళితులపై పెట్టిన కేసును రద్దు చేయాలన్నారు. పొదిలి మండలం మూగచింతలలో దళితులు సాగు చేసుకుంటున్న భూములను అక్రమంగా ఆన్‌లైన్‌ చేసుకుని ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అనంతరం డీఆర్వో ఓబులేసుకు వినతిపత్రం అందజేశారు. ముందుగా అంబేడ్కర్‌ భవన్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని