ఆ పోస్టులు.. పదే పదే ప్రకటనలు
విద్యాశాఖకు అనుబంధంగా నడుస్తున్న సమగ్రశిక్ష విభాగంలో సెక్టోరల్ అధికారుల నియామక అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. దాదాపు రెండేళ్లుగా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి ప్రకటన జారీ చేశారు.
సమగ్రశిక్షలో నియామకాల పరిస్థితి
జోరుగా రాజకీయ పైరవీలు
విద్యాశాఖకు అనుబంధంగా నడుస్తున్న సమగ్రశిక్ష విభాగంలో సెక్టోరల్ అధికారుల నియామక అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. దాదాపు రెండేళ్లుగా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి ప్రకటన జారీ చేశారు. వీటి నియామకం చేపట్టినప్పుడల్లా రాజకీయ ప్రమేయంతో అర్ధంతరంగా నిలిచిపోవడం జరుగుతోంది. గతంలో సంయుక్త కలెక్టర్ స్థాయిలో మౌఖిక పరీక్షలు పూర్తిచేసిన తరువాత కూడా ఎంపికైన వారికి ఉత్తర్వులు ఇవ్వకుండా నిలిపివేశారు. ఇప్పుడు అవే పోస్టులకు మళ్లీ ఆహ్వానించడం గమనార్హం.
సమగ్రశిక్ష కార్యాలయం
న్యూస్‌టుడే, ఒంగోలు నగరం: సమగ్రశిక్షలో శాశ్వత నియామకాలు లేవు. అర్హులైన ఉన్నతపాఠశాలల ప్రధానోపాధ్యాయులు, స్కూలు అసిస్టెంట్లను నియమిస్తుంటారు. విద్యా పర్యవేక్షణ అధికారి, కమ్యూనిటీ మొబలైజేషన్ అధికారి, ఎంఐఎస్ కోఆర్డినేటర్, ఇన్‌క్లూజివ్ ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ వంటి విధులను అదనపు ప్రాజెక్టు అధికారి పర్యవేక్షణలో నిర్వహిస్తారు. గతంలో రాష్ట్రస్థాయిలో ప్రకటన ఇచ్చి రాతపరీక్ష ద్వారా అర్హులను ఎంపిక చేసేవారు. ఇప్పుడు జిల్లాస్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన ఎంపిక చేసేలా ఉత్తర్వులిచ్చారు. దీంతో రాజకీయ నాయకుల సిఫార్సులు పెరిగాయి. తమకు అనుకూలమైన వారిని నియమింపజేయాలని వారు వత్తిడి చేస్తున్నారు. 2021లో పోస్టుల నియామకం ఇదే మాదిరి వివాదాస్పదంగా మారింది. సెక్టోరల్ అధికారిగా నియమితులైన వారు ఏడాదికి ఒకసారి పునరుద్ధరించుకుంటూ గరిష్టంగా అయిదేళ్లు పనిచేయవచ్చు. పాఠశాలలపై పర్యవేక్షణ అధికారాలు కలిగి ఉండటం, ఆదాయం, హోదా ఇలాంటి సౌకర్యాలు ఉండటంతో కొంతమంది నేతల ద్వారా సిఫార్సులు చేయించుకుంటున్నారు.
నిబంధనలు అమలయ్యేనా..
సమగ్రశిక్ష సెక్టోరల్ పోస్టుల నియామకం అన్ని జిల్లాల్లో పూర్తయింది. ప్రకాశంలో మాత్రం రెండేళ్ల కాలంలో రెండుసార్లు ప్రకటనలు ఇచ్చి రాజకీయవత్తిళ్లతో నిలిపివేశారు. 2021లో ఇచ్చిన ప్రకటననే చూసుకుంటే అప్పుడు అర్హులు పెద్దసంఖ్యలో దరఖాస్తుచేశారు. మౌఖిక పరీక్షల దశలో నిలిపివేశారు. మూడు మాసాల క్రితం నాలుగు పోస్టులకు జేసీ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు జరిగాయి. ఎంపికైనవారికి ఉత్తర్వులు ఇచ్చే దశలో ఆగిపోయింది. తాజాగా ఏడు పోస్టులకు మళ్లీ ప్రకటన ఇచ్చారు. గతంలో ఎంపికైన వారిని ఎందుకు నియమించలేదనేది అంతుపట్టని అంశం. వాస్తవానికి సెక్టోరల్ అధికారుల అవసరం ఎంతో ఉంది. విద్యాకానుక, కేజీబీవీలు, విద్యాకమిటీలు, నాడు-నేడు పనులు, ఉపాధ్యాయుల శిక్షణా కార్యక్రమాలు, కార్యాలయంలో అకౌంట్స్ వంటి విధులన్నీ వారిద్వారానే జరగాలి. రెండేళ్లుగా కేవలం ఇద్దరు మాత్రమే పనిచేస్తున్నారు. నిబంధనల ప్రకారం ఎంపికయ్యేవారికి 50 ఏళ్లు దాటకూడదు. గతంలో అయిదేళ్లు పాటు పనిచేసినవారు అనర్హులు. ఉపాధ్యాయుడు ఎక్కడ పనిచేస్తున్నారో మళ్లీ అదే స్థానంలోకి వెళ్లాలి. ఈ మూడు నిబంధనలు సక్రమంగా అమలు జరుగుతాయా అనేది ప్రశ్నార్థకం. ఈ పోస్టుల కోసం ఇప్పటికే రాజకీయ పైరవీలు మొదలయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Intresting News: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Road Accident: టూరిస్టు బస్సు బోల్తా.. 8 మంది మృతి
-
Gangula: తెలంగాణలో రేషన్ డీలర్లకు కమీషన్ పెంపు: మంత్రి గంగుల
-
Manipur: అల్లర్లతో అట్టుడికిన మణిపుర్లో.. ఉగ్ర కలకలం
-
Lokesh: పవన్ సభకు ప్రభుత్వం ఆటంకం కలిగించే అవకాశం: లోకేశ్
-
Asian Games: భారత్కు మరో రెండు పతకాలు.. ఫైనల్కు కిదాంబి శ్రీకాంత్