logo

యువగళం.. కావాలి విజయవంతం

మాజీ మంత్రి, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపడుతున్న ‘యువగళం’ పాదయాత్రకు మద్దతుగా జిల్లాలోని పార్టీ శ్రేణులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.

Published : 30 Jan 2023 01:47 IST

సి.ఎస్‌.పురంలో ద్విచక్ర వాహనాలతో ప్రదర్శన నిర్వహిస్తున్న తెదేపా నాయకులు

సి.ఎస్‌.పురం, కొండపి, న్యూస్‌టుడే: మాజీ మంత్రి, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపడుతున్న ‘యువగళం’ పాదయాత్రకు మద్దతుగా జిల్లాలోని పార్టీ శ్రేణులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఆదివారం తెదేపా రాష్ట్ర ఎస్సీ సెల్‌ కార్యదర్శి దాసరి మల్లికార్జునరావు ఆధ్వర్యంలో సి.ఎస్‌.పురం నుంచి భైరవకోన వరకు తెదేపా నాయకులు, కార్యకర్తలు ద్విచక్ర వాహనాలతో ప్రదర్శన నిర్వహించారు. యువగళం విజయవంతం కావాలని, వచ్చే ఎన్నికల్లో కనిగిరి శాసనసభ్యుడిగా ముక్కు ఉగ్రనరసింహారెడ్డి విజయం సాధించాలని ఆకాంక్షించారు. త్రిముఖ దుర్గాంబను దర్శించుకుని 101 కొబ్బరి కాయలను కొట్టి పూజలు చేశారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు పి.రామచంద్రారెడ్డి, ఇండ్ల లక్ష్మణ్‌, ఎం.శ్రీనివాసులు, కె.తిరుపతయ్య, యు.మాలకొండరాయుడు, డి.రంగస్వామి తదితరులు పాల్గొన్నారు.  

కలిసి అడుగులు వేస్తూ..

యువగళం పాదయాత్రలో తెదేపా రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్యనారాయణ పాల్గొన్నారు. ఆదివారం కుప్పం నియోజకవర్గంలో సాగుతున్న యాత్రలో ఆయనతో పాటు ముండ్లమూరు మండల తెదేపా అధ్యక్షుడు కూరపాటి శ్రీను, కార్యకర్తలు కూడా కలిసి సాగారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ కార్యక్రమానికి ప్రతి గ్రామంలోను పెద్ద ఎత్తున యువత, మహిళలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. యువతకు భరోసా కల్పిస్తూ మ్యానిఫెస్టో తెస్తామని చెప్పడం తెదేపా చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు.

పాదయాత్రలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌తో కలిసి నడుస్తున్న దామచర్ల సత్య, నాయకులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని