logo

వైద్య కళాశాలకు తండ్రి మృతదేహం అప్పగింత

వృద్ధాప్య సమస్యలతో తమ తండ్రి మృతిచెందడంతో ఆయన మృతదేహాన్ని వైద్య కళాశాలకు అప్పగించి ఆదర్శంగా నిలిచారు కుమార్తెలు.

Published : 30 Jan 2023 01:47 IST

కుమార్తెల ఆదర్శ నిర్ణయం

కొండయ్య మృతదేహంతో కుమార్తె కొండమ్మ, కుటుంబ సభ్యులు

కనిగిరి, న్యూస్‌టుడే: వృద్ధాప్య సమస్యలతో తమ తండ్రి మృతిచెందడంతో ఆయన మృతదేహాన్ని వైద్య కళాశాలకు అప్పగించి ఆదర్శంగా నిలిచారు కుమార్తెలు. కనిగిరిలో ఆదివారం ఈ సంఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని ఇందిరా కాలనీకి చెందిన కొమ్మిరెడ్డి కొండయ్య(75) వయోభారంతో ఆదివారం నివాసంలోనే మృతిచెందారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. వారిలో ఒకరైన కొండమ్మ వైద్య ఆరోగ్య శాఖలో ఏఎన్‌ఎంగా పని చేస్తున్నారు. మూడేళ్ల క్రితం ‘అమ్మ నేత్ర, శరీర అవయవ ప్రోత్సాహక స్వచ్ఛంద సంస్థ’ సభ్యులు అవయవ దానం గొప్పతనాన్ని కొండయ్య కుటుంబానికి వివరించారు. దీంతో ఆయనతో పాటు కుమార్తెలు అప్పట్లో అవయవ దానానికి అంగీకారం తెలిపారు. ఆదివారం కొండయ్య మృతి చెందడంతో స్వచ్ఛంద సంస్థకు సమాచారం ఇచ్చారు. సభ్యులు వచ్చి మృతదేహాన్ని అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురం వైద్య కళాశాలకు తీసుకెళ్లారు. కొండమ్మ మాట్లాడుతూ మరణానంతరం తమ శరీరాలను కూడా కళాశాలకు అప్పగించేలా అంగీకారం తెలిపామన్నారు. ఈ సోదరిలను స్థానిక మదర్‌ సేవా సమితి, మానవత సంస్థ సభ్యులు పసుపులేటి అరుణోధర్‌, వాగిచెర్ల వెంకటేశ్వర్లు, సయ్యద్‌ నాయబ్‌ రసూల్‌, ఉమాకాంత్‌, బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి ఈర్ల విజయరామరాజు అభినందించారు. వీరు తీసుకున్న నిర్ణయం సమాజానికి స్ఫూర్తిదాయకమన్నారు.

కొండయ్య(పాత చిత్రం)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని