logo

చేదోడు కింద రూ.14.52 కోట్ల లబ్ధి

జగనన్న చేదోడు పథకం కింద జిల్లాలోని 14,527 మంది లబ్ధిదారులకు రూ.10 వేల చొప్పున రూ.14.52 కోట్ల మేర లబ్ధి చేకూరినట్లు కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ తెలిపారు.

Published : 31 Jan 2023 01:51 IST

లబ్ధిదారులకు చెక్కు అందజేస్తున్న కలెక్టర్‌ దినేష్‌కుమార్‌, జడ్పీ ఛైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాసరెడ్డి తదితరులు  

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: జగనన్న చేదోడు పథకం కింద జిల్లాలోని 14,527 మంది లబ్ధిదారులకు రూ.10 వేల చొప్పున రూ.14.52 కోట్ల మేర లబ్ధి చేకూరినట్లు కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ తెలిపారు. ప్రకాశం భవన్‌లో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి కార్యక్రమంలో లబ్ధిదారులకు చెక్కు అందజేశారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న ఆర్థికసాయాన్ని మెరుగైన జీవనోపాధి కోసం వినియోగించుకోవాలన్నారు. చేతి వృత్తులపై ఆధారపడి జీవిస్తున్నవారికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు. జడ్పీ ఛైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. మాజీ మంత్రి, ఒంగోలు శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఎలాంటి వివక్ష, లంచాలకు తావు లేకుండా అత్యంత పారదర్శకంగా సంక్షేమ పథకాలకు అమలు చేస్తున్న ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. బీసీ కులాలకు ఒంగోలులో ఆరామ క్షేత్రాలు కూడా నిర్మిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ మేయర్‌ గంగాడ సుజాత, పీడీసీసీ బ్యాంకు ఛైర్మన్‌ మాదాసి వెంకయ్య, బీసీ కార్పొరేషన్‌ ఈడీ ఎం.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తొలుత గాంధీజీ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని