logo

పంట రక్షణకు వినూత్న ఆలోచన

ఒంగోలుకు చెందిన లారీల యజమాని జలీల్‌కు కొత్తపట్నం మండలం సముద్ర తీర ప్రాంతం సమీపంలోని పాదర్తిలో కొంత పొలం ఉంది. ఇసుక నేలలు కావడంతో సాధారణంగా చామదుంప, వేరుశెనగ వంటి పంటలు పండిస్తుంటారు.

Published : 31 Jan 2023 01:51 IST

ఒంగోలుకు చెందిన లారీల యజమాని జలీల్‌కు కొత్తపట్నం మండలం సముద్ర తీర ప్రాంతం సమీపంలోని పాదర్తిలో కొంత పొలం ఉంది. ఇసుక నేలలు కావడంతో సాధారణంగా చామదుంప, వేరుశెనగ వంటి పంటలు పండిస్తుంటారు. సముద్రం నుంచి వచ్చే పడమటి గాలుల తీవ్రతకు ఆకులకు రంధ్రాలు పడి కొంతమేర నష్టం ఏర్పడుతోంది. పొలాల మధ్యలో ఉన్న గట్లు కూడా ఇసుకతో పూడి పోతుంటాయి. దీంతో జలీల్‌ ఓ ఆలోచన చేశారు. తన వద్ద ఉన్న లారీల పాత టైర్లను దాదాపు 160 వరకు పొలం వద్దకు తీసుకువచ్చారు. గట్ల బదులు వీటిని భూమిలో సగం వరకు పాతారు. తద్వారా గాలి నేరుగా మొక్కలకు తగలకుండా అడ్డుకట్ట పడుతుందని తెలిపారు. పైగా టైర్ల నుంచి వచ్చే వాసనకు కొన్ని విష పురుగులు కూడా పంటల దరికి చేరడం లేదన్నారు.

ఈనాడు, ఒంగోలు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని