logo

మహాత్ముడి స్మృతి పథంలో...

మహాత్ముడి వర్ధంతి సందర్భంగా పొదిలి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఎంఈవో ఎం.శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించిన గాంధీ జ్ఞాపకాల ప్రదర్శన ఆకట్టుకుంది.

Published : 31 Jan 2023 01:51 IST

ప్రదర్శన తిలకిస్తున్న విద్యార్థులు

మహాత్ముడి వర్ధంతి సందర్భంగా పొదిలి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఎంఈవో ఎం.శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించిన గాంధీ జ్ఞాపకాల ప్రదర్శన ఆకట్టుకుంది. ఆయన సేకరించిన... బాపూజీ రచనలు, దేశ విదేశాల్లో గాంధీ పేరిట విడుదల చేసిన తపాలా స్టాంపులు, కవర్లు, కార్డులు, బ్రోచర్లతో పాటు... ఆయన జీవితానికి సంబంధించిన 200కు పైగా పుస్తకాలను ప్రదర్శనలో ఉంచారు. వివిధ పాఠశాలల విద్యార్థులు వీటిని ఆసక్తిగా తిలకించారు. ఆర్య వైశ్య సంఘం నాయకుడు సోమిశెట్టి చిరంజీవి ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా  నిర్వహించిన చిత్రలేఖనం, వ్యాసరచన పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. ఉపాధ్యాయులు, ఆర్యవైశ్య సంఘం నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. భావితరాలకు మహాత్ముడి గొప్పతనం తెలియజేయాలన్న లక్ష్యంతో... ఆయనకు సంబంధించిన సమాచారం సేకరించి ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నట్లు ఎంఈవో శ్రీనివాసులు తెలిపారు.

విదేశాల్లో మహాత్ముడి చిత్రంతో ముద్రించిన కవర్లు

గాంధీజీ పేరిట విడుదల చేసిన స్టాంపులు

న్యూస్‌టుడే, పొదిలి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని