logo

హోంగార్డు ఉద్యోగాల పేరిట మోసం

పోలీసు శాఖలో హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ డబ్బులు తీసుకుని మోసగించాడని బాధితులు వాపోయారు.

Published : 31 Jan 2023 01:51 IST

బాధితుల ఫిర్యాదులు వింటున్న ఎస్పీ మలికా గార్గ్‌

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: పోలీసు శాఖలో హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ డబ్బులు తీసుకుని మోసగించాడని బాధితులు వాపోయారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నాటి స్పందన కార్యక్రమంలో ఎస్పీ మలికా గార్గ్‌కు ఫిర్యాదు చేశారు. తన కుమారుడికి హోంగార్డు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఉలవపాడు మండలానికి చెందిన వ్యక్తి రూ.3 లక్షలు తీసుకుని మోసం చేశాడంటూ పెద్దదోర్నాల మండలానికి చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేశారు. ః కస్టమర్‌ కేర్‌ నుండి ఫోన్‌ చేస్తున్నామని చెప్పి ఓటీపీ అడిగి తన ఖాతా నుంచి రూ.45 వేల విలువైన వస్తువులను కొనుగోలు చేసి మోసగించారని కొండపి మండలానికి చెందిన వ్యక్తి ఫిర్యాదు చేశారు. వీటిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని బాధితులకు ఎస్పీ హామీ ఇచ్చారు. అదనపు ఎస్పీ(క్రైమ్స్‌) ఎస్‌.వి.శ్రీధర్‌రావు, ఎస్‌బీ డీఎస్పీ బి.మరియదాసు, డీటీసీ డీఎస్పీ రామకృష్ణ, దిశ డీఎస్పీ పల్లపురాజు, ఐసీసీఆర్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.వి.రాఘవేంద్ర, ప్యానల్‌ అడ్వకేట్‌ బి.వి.శివరామకృష్ణ పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని