logo

ప్రతి శుక్రవారం కాఫీ విత్‌ క్లాప్‌ మిత్ర

‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో అనుమతులు పొందిన నిర్మాణ పనుల్లో అలసత్వం వహిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ హెచ్చరించారు.

Published : 01 Feb 2023 01:50 IST

సమావేశంలో పాల్గొన్న కలెక్టర్‌ దినేష్‌కుమార్‌, జేసీ అభిషిక్త్‌ కిషోర్‌, అధికారులు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో అనుమతులు పొందిన నిర్మాణ పనుల్లో అలసత్వం వహిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ హెచ్చరించారు. జిల్లాలోని మండల అధికారులతో ఒంగోలు ప్రకాశం భవన్‌ నుంచి ఆయన మంగళవారం వీక్షణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. నిర్మాణ పనుల పురోగతికి సంబంధించిన చిత్రాలను ఎప్పటికప్పుడు కలెక్టరేట్‌కు పంపించాలని సూచించారు. జగనన్న తోడు పథకంలో మంజూరైన రుణాలను లబ్ధిదారులకు అందించడంలో జాప్యం లేకుండా చూడాలన్నారు. ఫిబ్రవరి 7 నుంచి 10వ తేదీ వరకు ఆధార్‌ ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి శుక్రవారం 11 నుంచి 12 గంటల్లోపు కాఫీ విత్‌ క్లాప్‌ మిత్ర కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. 18-35 సంవత్సరాల్లోపు నిరుద్యోగ యువతను గుర్తించడానికి యూత్‌ సర్వేను ఫిబ్రవరి నాలుగో తేదీలోపు పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ అభిషిక్త్‌ కిషోర్‌, డీపీవో నారాయణరెడ్డి, సీపీవో వెంకటేశ్వర్లు, డీఈవో విజయభాస్కర్‌, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారిణి బేబిరాణి, జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి పేరయ్య, గ్రామ, వార్డు సచివాలయాల జిల్లా ఇన్‌ఛార్జి ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని