logo

వెలిగొండకు రూ.2 వేల కోట్లు కేటాయించాలి

పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుకు వచ్చే అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో ప్రభుత్వం రూ.2 వేల కోట్లు కేటాయించాలని..నిర్వాసితులకు ఆర్‌.ఆర్‌.ప్యాకేజీ నిధులు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం ఉప కలెక్టర్‌ కార్యాలయం ఎదుట రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

Published : 01 Feb 2023 01:50 IST

ఉప కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న రైతు సంఘం నాయకులు, నిర్వాసితులు

మార్కాపురం గ్రామీణం, న్యూస్‌టుడే : పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుకు వచ్చే అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో ప్రభుత్వం రూ.2 వేల కోట్లు కేటాయించాలని..నిర్వాసితులకు ఆర్‌.ఆర్‌.ప్యాకేజీ నిధులు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం ఉప కలెక్టర్‌ కార్యాలయం ఎదుట రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పశ్చిమ ప్రకాశం రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు గాలి వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో రైతు సంఘం నాయకులు, నిర్వాసితులు కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు ఏళ్లు అవుతున్నా అప్పుడు నీళ్లు ఇస్తాం, ఇప్పుడు ఇస్తామని చెప్పి ప్రాజెక్టును పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యహరిస్తోందని పేర్కొన్నారు. ఈ మాటలతో ఈ ప్రాంత రైతులను మోసం చేయడమేనన్నారు. నిర్వాసితుల సమస్యలను పరిష్కరించకపోతే భారీ ఎత్తున ఆందోళనలకు ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు తెలిపారు. ధర్నా అనంతరం కార్యాలయంలోని అధికారి హరిబాబుకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల కార్యదర్శి గంగిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, నాయకులు కె.డేవిడ్‌, బొగ్గు రామిరెడ్డి, నాయబ్‌ రసూల్‌, నిర్వాసితులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని