logo

కస్తూర్బా విద్యార్థినికి తీవ్ర అస్వస్థత

స్థానిక కస్తూర్బా గాంధీ గురుకుల విద్యాలయంలో 10వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని తీవ్ర అనారోగ్యానికి గురై ప్రస్తుతం గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఎన్నారై ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

Published : 01 Feb 2023 01:50 IST

దొనకొండ, న్యూస్‌టుడే: స్థానిక కస్తూర్బా గాంధీ గురుకుల విద్యాలయంలో 10వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని తీవ్ర అనారోగ్యానికి గురై ప్రస్తుతం గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఎన్నారై ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. బాలిక కుటుంబసభ్యులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం సంక్రాంతి సెలవులకు ఇంటికి వచ్చిన బాలికను ఈ నెల 23వ తేదీ పాఠశాలలో విడిచిపెట్టారు. 24వ తేదీ వాంతులు అవడంతో అక్కడ ఉన్న సిబ్బంది కొన్ని మందులు ఇచ్చారు. రెండు రోజులు పాటు వసతిగృహంలోనే ఉంటూ విశ్రాంతి తీసుకున్నప్పటికీ పరిస్థితి మెరుగుపడకపోవడంతో పాఠశాల సిబ్బంది 27వ తేదీన కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు వచ్చి మార్కాపురంలో ఒక రోజు చికిత్స చేయించారు. ఆరోగ్యం మరింత క్షీణిస్తుండటంతో ఒంగోలు తీసుకెళ్లారు. వైద్యుల సూచనల మేరకు ప్రస్తుతం ఎన్నారై ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. అక్కడి వైద్యులు పరీక్షలు చేసి ఆమె శరీరంలో విషపూరిత ఆనవాళ్లు కనిపిస్తున్నాయని చెప్పారు. పాఠశాలలోనే ఏదో జరిగిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. విద్యాలయ సిబ్బంది మాత్రం సెలవుల నుంచి వచ్చే సరికి అనారోగ్యంతో ఉందని, అంతకంతకు క్షీణించిందని తెలిపారు. ఈ విషయంపై ఎలాంటి కేసు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని