logo

3 నెలలు.. కిలో బియ్యమూ ఇవ్వలేదు

తమకు తెల్లరేషన్‌ కార్డులున్నప్పటికీ మూడు నెలలుగా బియ్యం ఇవ్వడం లేదంటూ కనిగిరి మండలం బుడ్డాయపల్లి వాసులు ఆవేదన వ్యక్తం చేశారు.

Published : 02 Feb 2023 03:37 IST

కార్డులు చూపుతూ ఆందోళన చేస్తున్న బుడ్డాయపల్లి గ్రామస్థులు

కనిగిరి, న్యూస్‌టుడే: తమకు తెల్లరేషన్‌ కార్డులున్నప్పటికీ మూడు నెలలుగా బియ్యం ఇవ్వడం లేదంటూ కనిగిరి మండలం బుడ్డాయపల్లి వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు గ్రామంలో బుధవారం ఆందోళన చేశారు. తామందరం పేదలమని.. కూలి పనులకు వెళ్లి జీవనం సాగిస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వం సరఫరా చేసే రూపాయికి కిలో బియ్యాన్ని డీలర్‌ గత మూడు నెలలుగా ఇవ్వకుండా మాయం చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నప్పటికీ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో సుమారు 200 వరకు రేషన్‌ కార్డులున్నాయని.. ఏ ఒక్కరికీ కిలో బియ్యం కూడా ఇవ్వడం లేదన్నారు. ఉన్నతాధికారులు స్పందించి డీలర్‌పై చర్యలు తీసుకుని.. తమకు వెంటనే బియ్యం అందించేలా చూడాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని