logo

1నే జీతాలిచ్చేలా చట్టం చేయాలి

ఉద్యోగులకు ప్రతినెలా ఒకటో తేదీనే జీతాలిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేయాలని ఏపీజీఈఏ జిల్లా అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు చిన్నపురెడ్డి కిరణ్‌ కుమార్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.

Published : 02 Feb 2023 03:37 IST

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ఉద్యోగులకు ప్రతినెలా ఒకటో తేదీనే జీతాలిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేయాలని ఏపీజీఈఏ జిల్లా అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు చిన్నపురెడ్డి కిరణ్‌ కుమార్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. ‘ఉద్యోగుల జీతభత్యాలు- మార్గదర్శకాలు- చట్టబద్ధత’ అనే అంశంపై ఒంగోలు తహసీల్దార్‌ కార్యాలయం ఆవరణలోని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యాలయంలో బుధవారం చర్చా వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా కిరణ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఆర్థిక బకాయిల చెల్లింపునకు టైం షెడ్యూల్‌ విడుదల చేయాలని కోరారు. 11వ పీఆర్సీలో అలవెన్స్‌కు సంబంధించిన ఉత్తర్వులు, టైం స్కేల్స్‌ ఇంతవరకు ఇవ్వకపోవడం శోఛనీయం అన్నారు. పూర్తిస్థాయి జీవోలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గవర్నర్‌ బిష్వభూషణ్‌ను ఏపీజీఈఏ రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ కలవడంలో తప్పు లేదని అభిప్రాయపడ్డారు. సమావేశంలో సంఘం నాయకులు పి.వరకుమార్‌, పాండు రంగారెడ్డి, తారక రామారావు, టి.సుబ్బారెడ్డి, విజయశ్రీ, లక్ష్మీగాయత్రి, శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని