logo

పింఛను కోసం ఇంటికి వస్తూ దుర్మరణం

స్థానిక రైల్వే స్టేషనులో బుధవారం వేకువ జామున 3 గంటల సమయంలో పట్టాలు దాటుతున్న ఓ వ్యక్తిని రైలు ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందారు.

Published : 02 Feb 2023 03:37 IST

ఆశీర్వాదం (పాత చిత్రం)

సింగరాయకొండ గ్రామీణం, న్యూస్‌టుడే: స్థానిక రైల్వే స్టేషనులో బుధవారం వేకువ జామున 3 గంటల సమయంలో పట్టాలు దాటుతున్న ఓ వ్యక్తిని రైలు ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. ఒంగోలు జీఆర్పీ ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల మేరకు నెల్లూరు జిల్లా వలేటివారిపాలెం మండలం పోలినేని చెరువు గ్రామానికి చెందిన నేలపాటి ఆశీర్వాదం(75) హైదరాబాదులో పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఆయనకు వృద్ధాప్య పింఛను ఉండటంతో ప్రతి నెల హైదరాబాదు నుంచి స్వగ్రామం వచ్చి తీసుకునేవారు. ఈ నెల కూడా పింఛను తీసుకొనేందుకు బుధవారం తెల్లవారుజామున సింగరాయకొండలో చెన్నై ఎక్స్‌ప్రెస్‌ రైలు దిగి పట్టాలు దాటుతుండగా ఒంగోలు వైపు వెళ్తున్న ఎక్స్‌ప్రెస్‌ రైలు ఢీకొట్టడంతో శరీరం ఛిద్రమై అక్కడికక్కడే మృతిచెందారు. ఆయన ఆధార్‌కార్డు ద్వారా వివరాలు సేకరించిన పోలీసులు ఆయన కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. ఒంగోలు రిమ్స్‌కు మృతదేహాన్ని తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని