logo

అనుమానాస్పద స్థితిలో వీఆర్‌ఏ మృతి

అనుమానాస్పద స్థితిలో వీఆర్‌ఏ మృతి చెందారు. దర్శి ఎస్సై రామకృష్ణ, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజంపల్లికి చెందిన రాచపూడి కాశయ్య (43) వీఆర్‌ఏగా విధులు నిర్వహిస్తున్నారు.

Updated : 03 Feb 2023 02:06 IST

కాశయ్య (పాత చిత్రం)

దర్శి, న్యూస్‌టుడే: అనుమానాస్పద స్థితిలో వీఆర్‌ఏ మృతి చెందారు. దర్శి ఎస్సై రామకృష్ణ, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజంపల్లికి చెందిన రాచపూడి కాశయ్య (43) వీఆర్‌ఏగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన తల్లి, సోదరి నివాసముంటున్న రామలేడు గ్రామానికి వెళ్లేందుకు గురువారం ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. తరువాత... కొత్తపల్లి సమీపంలోని ముసి వాగులో విగతజీవిగా కనిపించారు. అటుగా వెళ్లిన స్థానికులు గమనించి కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడికి భార్య సునీత, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మద్యం తాగి ద్విచక్ర వాహనంపై వెళ్తూ ప్రమాదానికి గురై ఉండొచ్చని భావిస్తున్నారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పరీక్ష నిమిత్తం దర్శి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని