logo

కలకలం రేపుతున్న మద్యం కుంభకోణం

దిల్లీ మద్యం కుంభకోణం కలకలం రేపుతోంది. ఇప్పటికే ఈ కేసులో పలువురు అరెస్టు అయ్యారు. తాజాగా ఈడీ దాఖలు చేసిన రెండో ఛార్జిషీట్‌లో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన తనయుడు రాఘవరెడ్డి పేర్లు ప్రస్తావించింది.

Published : 03 Feb 2023 01:56 IST

ఛార్జిషీట్‌లో ఎంపీ మాగుంట పేరు ఉండటంపై చర్చ

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: దిల్లీ మద్యం కుంభకోణం కలకలం రేపుతోంది. ఇప్పటికే ఈ కేసులో పలువురు అరెస్టు అయ్యారు. తాజాగా ఈడీ దాఖలు చేసిన రెండో ఛార్జిషీట్‌లో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన తనయుడు రాఘవరెడ్డి పేర్లు ప్రస్తావించింది. గతంలోనూ ఎంపీ పేరును ప్రస్తావించారు. ఆ తర్వాత చెన్నై, నెల్లూరుల్లో మాగుంట, ఆయన సన్నిహితుల నివాసాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌(ఈడీ) అధికారులు సోదాలు చేశారు. ఆయన తనయుడు రాఘవరెడ్డిని ఒక దఫా విచారించారు. వీటిపై మాగుంట అప్పట్లోనే స్పందించి వివరణ ఇచ్చారు. తన కుటుంబం తాతల కాలం నుంచి మద్యం వ్యాపారంలో ఉందన్నారు. అందుకనే దిల్లీ మద్యం వ్యాపారంలో తాము ఉన్నట్లు భావిస్తున్నారని.. వాస్తవానికి దీంతో ఏ సంబంధాలు లేవని కొట్టిపారేశారు. దక్షిణాది వ్యాపారులు దిల్లీలో విస్తరించకుండా ఓ పథకం ప్రకారం కుట్ర జరుగుతుందని ఆరోపించారు. ఆ తర్వాత కూడా పలు దఫాలు ఆయన పేరు బయటకు వచ్చినా స్పందించలేదు. కేసు పూర్వాపరాలు పరిశీలిస్తున్నామని, ఆ తర్వాత స్పందిస్తామని వెల్లడించారు. ప్రస్తుతం మరోమారు ఈడీ ఛార్జిషీట్‌లో పేర్కొనడంతో ఈ వ్యవహారం జిల్లా రాజకీయాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఎంపీ స్వస్థలమైన నెల్లూరులో రాజకీయాలు శరవేగంగా మలుపులు తిరుగుతున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తమ పార్టీపై చేస్తున్న ఆరోపణలతో ఆ జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని