logo

అక్టోబర్‌ నాటికి వెలిగొండ పూర్తి

పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణ పనులు అక్టోబర్‌ నాటికి పూర్తిచేస్తామని తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

Published : 06 Feb 2023 01:51 IST

త్రితిదే ఛైర్మన్‌ వైవీ

వెలిగొండ రెండో సొరంగం వద్ద తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి సురేష్‌

పెద్దదోర్నాల, న్యూస్‌టుడే: పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణ పనులు అక్టోబర్‌ నాటికి పూర్తిచేస్తామని తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. దోర్నాల మండలం కొత్తూరు సమీపంలో జరుగుతున్న సొరంగ నిర్మాణ పనులను ఆయన ఆదివారం రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి సురేష్‌, మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డిలతో కలిసి పరిశీలించారు. సొరంగం తవ్వకం పనులు పూర్తయ్యాయని నీటిని విడుదల చేసేందుకు సిద్ధంగా ఉందని ఇంజినీరింగ్‌ అధికారులు వారికి వివరించారు. రెండో సొరంగంలోకి కొంత దూరం వాహనంలో వెళ్లి వచ్చారు. నిర్మాణ పనుల పురోగతిపై సీఈ మురళీనాథరెడ్డితో చర్చించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ....గత ప్రభుత్వం వెలిగొండ తొలి సొరంగం నిర్మాణాన్ని కూడా పూర్తి చేయలేకపోయిందన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ నిధులు కేటాయించి పనుల పురోగతికి దోహదపడ్డారన్నారు. తొలి సొరంగం తవ్వకం పనులు పూర్తయ్యి నల్లమల సాగర్‌ రిజర్వాయర్‌కు నీరందించేందుకు సిద్ధంగా ఉంది.  రెండో సొరంగంలో 2.6 కి.మీల తవ్వకం జరగాల్సి ఉందన్నారు. ఆ పనులను నాలుగు, అయిదు నెలల్లో పూర్తి చేస్తామని ఇంజినీరింగ్‌ అధికారులు తెలిపారన్నారు. రిజర్వాయర్‌లో రెగ్యులేటర్ల నిర్మాణ పనులు సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉందన్నారు. ఎస్‌ఈ అబూతలిమ్‌, భూసేకరణ ప్రత్యేక కలెక్టర్‌ సరళావందనం, ఏఎంసీ ఛైర్మన్‌ శ్రీనివాసరెడ్డి, మాజీ జడ్పీటీసీ సభ్యుడు అమిరెడ్డి రామిరెడ్డి, గుత్తేదారు సంస్థ ప్రతినిధులు, ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని