logo

విఠలాపురం సర్పంచిపై కేసు

తాళ్లూరు మండలం విఠలాపురం సర్పంచి ఎం.ఇంద్రసేనారెడ్డిని మూడు నెలలు పాటు సస్పెండ్‌ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేసినట్టు ఎంపీడీవో కేవై.కీర్తి తెలిపారు.

Published : 06 Feb 2023 01:51 IST

ముండ్లమూరు, న్యూస్‌టుడే: తాళ్లూరు మండలం విఠలాపురం సర్పంచి ఎం.ఇంద్రసేనారెడ్డిని మూడు నెలలు పాటు సస్పెండ్‌ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేసినట్టు ఎంపీడీవో కేవై.కీర్తి తెలిపారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం బిల్లులు చెల్లించాలంటూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసినప్పటికీ నిధులను దారి మళ్లించారు. ఈ విషయమై కోర్టు ధిక్కరణ వ్యాజాన్ని పిటీషనర్లు హైకోర్టులో దాఖలు చేయడంతో సర్పంచిపై చర్యలకు ఉన్నతాధికారులను న్యాయమూర్తి ఆదేశించారు. ఈ క్రమంలో ఇంద్రసేనారెడ్డిని మూడు నెలలు సస్పెండ్‌ చేస్తూ.. అతనిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఇంద్రసేనారెడ్డిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎంపీడీవో కీర్తి తాళ్లూరు పోలీస్‌ స్టేషన్‌లో ఆదివారం ఫిర్యాదు చేశారు. ఎస్సై ప్రేమకుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ఉరి వేసుకొని యువకుడి ఆత్మహత్య

మార్కాపురం నేరవిభాగం: మార్కాపురం పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉంటున్న ఇండ్ల రామకృష్ణారెడ్డి (25) ఆదివారం ఇంట్లో గాలి పంకాకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఈయన  పట్టణంలోని కంభం రోడ్డులో ఉన్న ఓ సత్రంలో కాపలాదారునిగా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తుండేవారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. బాధితుడికి తల్లిదండ్రులు, బంధువులు ఎవరూ లేరని, బలవన్మరణానికి కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు చెప్పారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని