logo

ఎవరూ స్పందించలేదు

మార్కాపురం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘స్పందన’లో పరిస్థితి చూశారా.. ఎంతోమంది ప్రజలు తమ సమస్యలు విన్నవించుకోవడానికి వచ్చే ఈ కార్యక్రమానికి వివిధ శాఖల అధికారులే డుమ్మా కొట్టారు.

Updated : 07 Feb 2023 06:38 IST

సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో ఇదీ పరిస్థితి

స్పందనలో అధికారులు లేక ఖాళీగా దర్శనమిస్తున్న కుర్చీలు

మార్కాపురం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘స్పందన’లో పరిస్థితి చూశారా.. ఎంతోమంది ప్రజలు తమ సమస్యలు విన్నవించుకోవడానికి వచ్చే ఈ కార్యక్రమానికి వివిధ శాఖల అధికారులే డుమ్మా కొట్టారు. సబ్‌ కలెక్టర్‌ సేతుమాధవన్‌ ప్రయాణిస్తున్న కారు ఇటీవల చీమకుర్తి వద్ద ప్రమాదానికి గురవడంతో అప్పటినుంచి ఆయన సెలవులో ఉన్నారు. ఆయన ఉన్నప్పుడు ప్రతిఒక్క అధికారి తప్పనిసరిగా ‘స్పందన’కు హాజరయ్యేవారు. వచ్చిన అర్జీలను పరిష్కరించమని సేతు మాధవన్‌ అందించేవారు. కానీ ఈసారి పరిస్థితి భిన్నం. ఆయన లేరని తెలియడంతో మున్సిపల్‌ కమిషనర్‌, డీడీవో, డీఎల్‌పీవో, ఏవో మినహా మిగిలిన అధికారులెవరూ హాజరుకాలేదు. దీంతో వారి కోసం ఏర్పాటుచేసిన కుర్చీలన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. అర్జీలను సంబంధితశాఖలకు పంపించాలంటూ ఇన్‌ఛార్జి డీఏవో హరి సిబ్బందికి ఆదేశించారు.
న్యూస్‌టుడే, మార్కాపురం అర్బన్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని